‘తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఛోటా కె. నాయుడును వెలి వేయండి’ అని ట్విట్టర్లో సోమవారం కాజల్ అగర్వాల్ అభిమానులు చిన్నపాటి ఉద్యమం లేవనెత్తారు. ఒకానొక దశలో ‘బ్యాన్ ఛోటా ఫ్రమ్ టిఎఫ్ఐ’ హ్యాష్‌ట్యాగ్ హైదరాబాద్‌లో ట్రెండ్ అయ్యింది. దీనంతటికీ కారణం ఒక్కటే… ‘కవచం’ టీజర్ లాంచ్‌లో కాజల్‌ని ఛోటా ముద్దు పెట్టుకోవడమే. కాజల్ కాస్త ఎత్తుగా వుండబట్టి బుగ్గ మీద పెట్టుకోవాలనుకున్న ముద్దు కొంచెం కిందకు వచ్చింది కానీ… లేదంటే బలంగా బుగ్గ మీద ఛోటా ముద్దు పెట్టేవారేమో! ఛోటా చర్యతో షాక్ తిన్న అభిమానులు అతడిపై ట్విట్టర్ వేదికగా యుద్ధం ప్రకటించారు. అతణ్ణి తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి వేలి వేయాలని ట్రెండ్ చేస్తున్నారు. హఠాత్తుగా ఛోటా ఇచ్చిన ముద్దుకు కాజల్ కూడా షాక్‌కి గురయ్యారు. ‘ఛాన్స్ పే డ్యాన్స్’ అంటూ సెటైర్ వేశారు. తరవాత వెంటనే తేరుకుని కవర్ చేసే ప్రయత్నం చేశారు. ‘ఛోటా తన కుటుంబంలో ఒకరు. పర్వాలేదు’ అని సర్దిచెప్పారు. అయితే ఛోటా చర్యను మాత్రం ప్రేక్షకులలో ఎక్కువశాతం మంది సమర్ధించడం లేదు. ‘ఛీ.. ఛీ.. ఛోటా. ఇవేం పనులు’ అంటున్నారు. వేదిక ఎక్కకముందు మెహ్రీన్తోనూ ఛోటా కె నాయుడు అసభ్యంగా ప్రవర్తించినట్టు సమాచారం.