కథానాయికగా పదేళ్ల ప్రయాణం కాజల్‌ది. ఈ జర్నీలో హిట్స్, ఫ్లాప్స్ రెండింటినీ సమానంగా చవిచూసింది. ఓ దశలో కాజల్ కెరీర్ ఖతం అనుకొన్నాంతా. కానీ.. అంతలోనే మళ్లీ పుంజుకొంది. బడా హీరోల సరసన నటించే స్టామినా తనకు ఇంకా ఉందని నిరూపించుకొంటోంది. త్వరలోనే కాజల్ బ్రహ్మోత్సవంతో మళ్లీ సందడి చేయడానికి రెడీ అయ్యింది. సీరియర్ అయినా, ఆ గర్వాన్ని తలకెక్కించుకోలేదని, ఇప్పటికీ తాను నేర్చుకోవడానికి సిద్ధంగానే ఉన్నానంటోంది కాజల్.
జూనియర్ కథానాయికలు తనకి పోటీ అనుకోనని, వాళ్లనుంచీ ఏమైనా కొత్త విషయాలు నేర్చుకోవడానికీ రెడీగానే ఉన్నానని అంటోంది. ”ఎవరి దగ్గరి నుంచైనా, ఏదైనా నేర్చుకోవొచ్చు. ఆ విషయంలో సిగ్గు పడను. కథానాయికగా ఎంతో సాధించానన్న ఫీలింగ్ లేదు. సినిమా సినిమాకీ ఏదో ఓ కొత్త విషయం తెలుస్తూనే ఉంది” అంటోంది. మరో నాలుగేళ్లయినా కథానాయికగా రాణించే సత్తా తనలో ఉందని, అందుకే పెళ్లి గురించి ఏమీ ఆలోచించడం లేదని తేల్చి చెబుతోంది కాజల్. అంటే టాలీవుడ్‌ని ఇప్పట్లో వదిలేసే ప్రసక్తి ఈ అమ్మడికి లేదన్నమాట.