కాజల్ అనగానే.. పద్ధతైన పాత్రలే కళ్లముందు కదులుతాయి. లక్ష్మీ కల్యాణం నుంచి, సర్దార్ గబ్బర్ సింగ్ వరకూ… కాజల్ ఎప్పుడూ హద్దు దాటి నటించలేదు.. మరీ ఓవర్ ఎక్స్పోజింగూ చేయలేదు. సంసార పక్షమైన కమర్షియల్ హీరోయిన్ అనే ట్యాగ్‌లైన్‌తో హాయిగా బండి నెట్టుకొచ్చేస్తోంది. అయితే… ఈమధ్య గ్లామర్ పాత్రలవైపు కాజల్ దృష్టి మళ్లిందట. ”నన్ను హాట్‌గా చూపించరూ.. ” అంటూ దర్శకుల్ని అడుగుతోందట. ఎంత ఎక్స్పోజింగ్ చేస్తే… అంత గుర్తింపు అన్న నిజాన్ని కాజల్ ఇప్పుడిప్పుడే గ్రహించిందని.. అందుకే రూటు మార్చి ఆ తరహా పాత్రలపై దృష్టి నిలిపిందని తెలుస్తోంది.
అంతే కాదు, సంసార పక్షమైన పాత్రలు చేసి కాజల్కీ బోర్ కొట్టేసిందట. సర్దార్తో పాటు వచ్చే బ్రహ్మోత్సవంలోనూ కాజల్‌ది ఆ టైపు పాత్రే. కాబట్టి.. జస్ట్ ఫర్ ఛేంజ్‌గా మసాలా పాత్రలు కోరుకొంటోంది కాజల్. యువరాణిగా, చందమామగా కాజల్‌ని చూసిన కళ్లతో.. మరీ హాట్ హాట్ కాజల్‌ని చూడ్డం మనవల్ల అవుతుందా? పైగా కాజల్ వయసు పైబడుతోంది. ఆ విషయం సర్దార్లో స్పష్టంగా తెలిసిపోయింది. ఈ దశలో ఎక్స్పోజింగ్ చేస్తానంటే ఎట్టా?? కాజల్ కాస్త ఆలోచించుకో మరి.