వెంకటేష్ సరసన కాజల్ కథానాయికగా నటిస్తోందా?? అవుననే అంటున్నాయి ఫిల్మ్ నగర్ వర్గాలు. వెంకటేష్ కథానాయకుడిగా, తేజ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో కథానాయికగా కాజల్‌ని ఎంచుకొన్నారని తెలుస్తోంది. కాజల్‌కి బాగా అచ్చొచ్చిన దర్శకుడు తేజ. తన తొలి సినిమా తేజ దర్శకత్వంలోనే. 50వ చిత్రం (నేనే రాజు నేనే మంత్రి) కూడా తేజతోనే. ఇప్పుడు మరోసారి తేజతో కలసి పనిచేయబోతోందని సమాచారం. కాజల్ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఇంతకాలమైనా… వెంకీతో కలసి పనిచేయలేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరబోతోంది. ఇదో ఫ్యామిలీ డ్రామా అని తెలుస్తోంది. భార్యా భర్తల అనుబంధం నేపథ్యంలో సాగుతుందట. ఉమ్మడి కుటుంబాల మధ్య అనుబంధాల్ని తేజ తనదైన స్టైల్లో తీర్చిదిద్దబోతున్నారని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, ఏకే ఎంటన్టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నెల ద్వితీయార్థంలో సెట్స్‌పైకి వెళ్లనుంది.