మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి లీజు ముగిసినా సరే క్వార్ట్జ్ ను అడ్డగోలుగా దోపిడీ చేసి దొరికిపోయారు. ఆయనపై కేసు నమోదు అయింది. పొదలకూరు మండలంలోని రుస్తుం మైన్స్‌లో క్వార్ట్జ్ ఖనిజం దోపిడీ చేసిన కేసులో కాకాణిని ఏ4గా చేర్చారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దర్ని అరెస్టు చేశారు. రేపోమాపో కాకాణిని కూడా జైలుకు తరిలంచే అవకాశాలు ఉన్నాయి.
రుస్తుం మైన్స్‌కు సంబంధించిన లీజు గడువు ముగిసిపోయినా మైనింగ్ చేశారు. అప్పట్లో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవడానికి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మూడు రోజుల పాటు క్వారీ వద్ద సత్యాగ్రహ దీక్ష చేశారు. కేంద్ర మైనింగ్ శాఖకు ఫిర్యాదు చేశారు. విచారణ చేయాలని కేంద్రం ఆదేశాలు ఇచ్చినా అప్పటి వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో మైనింగ్ శాఖ అధికారులు దొంగతనం అయిన క్వార్డ్జ్ విలువను లెక్కించారు. రూ.250 కోట్లకు పైగా ఉంటుందని లెక్కలు కట్టి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఒంగోలు పార్లమెంట్ సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సంతకాలను ఫోర్జరీ చేసిన కేసులో ప్రభుత్వం సిట్‌ను నియమించింది. ఎంపీ సంతకాల ఫోర్జరీ కేసులో సైతం కాకాణిని నిందితుడిగా చేర్చే సూచనలు కనిపిస్తున్నాయి. సర్వేపల్లి రిజర్వాయర్‌లో గ్రావెల్ కుంభకోణం వెనుక కూడా కాకాణి హస్తం ఉందన్న ఆరోపణలు రావడంతో విచారణ జరుగుతోంది. మరో వైపు గతంలో సోమిరెడ్డి తప్పుడు కేసుల్లో ఇరికించడానికి తప్పుడు పత్రాలు సృష్టించి విదేశాల్లో ఆస్తులు ఉన్నాయని ఆరోపణలు చేసిన వ్యవహారంలో కూడా ఆయనపై కోర్టులో విచారణ జరుగుతోంది. ఆ సాక్ష్యాలను కోర్టు నుంచి దొంగతనం చేశారు.