మరో వైపీసీ నేత ఆజ్ఞాతంలోకి వెళ్లారు. నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయారు. శుక్రవారం కార్యకర్తలతో సమావేశం పెట్టారు. ఆ సమయంలో ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడిందని.. మధ్యంతర రిలీఫ్ లభించలేదని సమాచారం వచ్చింది. సమాచారం ముగిసిన తర్వాత ఆయన ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు.
రుస్తుం మైనస్ లో అనుమతుల్లేకుండా వందల కోట్ల క్వార్ట్జ్ కొల్లగొట్టిన కేసులో ఆయన ఏ 4గా ఉన్నారు. మిగతా ముగ్గురిని అరెస్టు చేశారు. కాకాణిని కూడా నేడో రేపో అరెస్టు చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆయన రిస్క్ ఎందుకులే అని హైకోర్టులో ముందస్తు బెయిల్ వచ్చే వరకూ అజ్ఞాతంలో ఉండాలని డిసైడయినట్లుగా చెబుతున్నారు.
గతంలోనూ ఇలా పలుమార్లు ఆజ్ఞాతంలోకి వెళ్లి ముందస్తు బెయిల్ వచ్చిన తర్వాత బయటకు వచ్చిన రికార్డు కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఉంది. గతంలో ఆయనపై నకిలీ మద్యం కేసులు, సోమిరెడ్డిపై తప్పుడు సర్టిఫికెట్లు చేయించిన కేసులు ఉన్నాయి. ఆయా కేసుల్లోనూ పరారయి.. న్యాయపరమైన అవకాశాలను వినియోగిచుకుంటున్నారు. ఇప్పుడు కూడా అరెస్టు అవుతామన్న భయంతో ఆజ్ఞాతంలోకి వెళ్లారు.