సీజ్ ద షిప్ అని పవన్ కల్యాణ్ ఇచ్చిన ఆదేశాలు చెల్లవంటూ వైసీపీ నేతలు వేసిన సైటైర్లు తేలిపోయాయి. ఆ షిప్ను సీజ్ చేసినట్లుగా కలెక్టర్ షన్మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ప్రకటించారు. ఆ షిప్లో పీడీఎఫ్ రైస్ ఉన్నది నిజమేనని స్పష్టం చేశారు. మొత్తం విచారణ నిర్వహిస్తున్నామని.. ఏ మిల్లు నుండి ఎవరు సప్లై చేశారు, షిప్ వరకు రావడానికి ఎవరు ట్రాన్స్పోర్టు చేశారో నిర్ధారణ చేస్తామన్నారు. కస్టమ్స్ డిపార్ట్, రెవెన్యూ, పోలీస్, పోర్ట్ అథారిటీ, సివిల్ సప్లై అధికారులతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి.. పోర్ట్ కి వెళ్ళే ప్రతి లోడు పరిశీలిస్తామని ప్రకటించారు. సీజ్ చేసిన షిప్ ప్రస్తుతం మన పోర్ట్ లో కంట్రోల్ లోనే ఉందిని తెలిపారు.
కాకినాడ పోర్ట్ పై ఉన్న చెడ్డ పెరు పోగెట్టే లా అధికార యంత్రాంగం పనిచేస్తుందిని ఎస్పీకి, కలెక్టర్ తెలిపారు. ఒక షిప్ ని ఆపడానికి పోర్ట్ కి అధికారం ఉంది. కొన్ని విషయాల్లో హై కోర్టు నిబంధనలు అనుసరించి సీజ్ చేసే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. పేర్ని నాని ఆరోపించిన కెన్ స్టార్ షిప్ లి తనిఖీలు చేశామని.. అందులో బాయిల్డ్ రైస్ మాత్రమే ఉందన్నారు. కెన్ స్టార్ షిప్ పయ్యావుల కేశవ వియ్యంకుడిదని అంతలో వేల టన్నుల బియ్యం ఉందని పేర్ని నాని ఆరోపించారు.
ఇప్పుడు కెన్ స్టార్ షిప్లో ఉన్నది బాయిల్డ్ రైస్ అని అధికారులు తేల్చారు. అయితే సీజ్ చేసిన షిప్లో మాత్రం రేషన్ బియ్యం ఉందని తేల్చారు. వైసీపీ నేతలు..తాముదొరికిపోతే ఎదుటివారిపై బురద చల్లడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. బియ్యం విషయంలోనూ అదే చేశారు. కానీ పోలీసులు క్లారిటీ ఇచ్చేశారు.