అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో ఉన్న పారిశ్రామికవేత్తల్ని బెదిరించి పోర్టుల్ని,సెజు్లను, రిసార్టులను లాగేసుకున్న వారు ఇప్పుడు దొరికిపోయేసరికి తిరిగి ఇచ్చేస్తాం కేసులు వద్దని బేరాలకు వస్తున్నారు. కాకినాడ పోర్టు వ్యవహారంలో ఏం జరిగిందో మొత్తం బయటకు రావడంతో అరబిందోతో పాటు ఈ వ్యవహారంలో మొత్తం భాగస్వామ్యం ఉన్న వారంతా ఉలిక్కిపడ్డారు. మా డబ్బులు మాకిచ్చేస్తే…పోర్టులో వాటాలను తిరిగి ఇస్తామని బేరం పెట్టారు. ఆ మేరకు వాటాలు మొత్తం మళ్లీ అసలు యజమాని అయిన కేవీ రావుకు బదిలీ చేశారు. మూడు రోజులకిందటే ఈ వాటాల బదిలీ పూర్తి అయిందని.. కాకినాడ పోర్టు మొత్తం మళ్లీ అసలు యజమాని కేవీ రావు చేతుల్లోకి వెళ్లింది.
రెండు బోగస్ ఆడిటింగ్ సంస్థల రిపోర్టులను అడ్డం పెట్టుకుని కెవీరావును బెదిరించి పోర్టును, సెజ్ ను లాగేసుకున్నారు. ప్రభుత్వ ప్రాయోజిత మాఫియా కావడంతో అప్పట్లో కెవీ రావు మాట్లాడలేకపోయారు. ప్రభుత్వం మారిన తర్వాత ఆయన సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈ డీల్ కు కర్త, కర్మ, క్రియ అయిన విజయసాయిరెడ్డిని ప్రశ్నించడంతో ఈడీ అధికారులకోు ఏం జరిగిందో ఓ స్పష్టత వచ్చింది. తర్వాత కెవీ రావును కూడా పిలిచి వివరాలు తెలుసుకున్నారు. మనీ లాండరింగ్ గుట్టు మొత్తం బయటకు వస్తూండటంతో తాము ఎక్కడ ఇరుక్కుపోతామోనని అందరూ భయపడిపోయారు. చివరికి పోర్టులో వాటాలు తిరిగి ఇచ్చేసి బయటపడాలని నిర్ణయించుకున్నారు.
అరబిందోను అడ్డం పెట్టుకుని ఈ గేమ్ ఆడింది జగన్ రెడ్డేనని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పేరుకు అరబిందో అయినా ఆ బినామీ వాటాలు జగన్ రెడ్డివేనని అంటున్నారు. ఈ క్రమంలో ఎవరి బినామీల కోసమో తాము ఎందుకు బలి అవ్వాలని అరబిందో వాటాల్ని వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకుంది.అయితే కాకినాడ సెజ్ లోనూ వాటాలు కొట్టేశారు. ఆ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. తన సెజ్ లోని వాటాల విషయంలో దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని కెవీ రావు చెబుతున్నారు.
పోర్టులో వాటాలను తిరిగి ఇచ్చేయడంతో మాఫియా తాను చేసిన తప్పును ఒప్పుకున్నట్లయింది. అయినా దర్యాప్తు సంస్థలు మాత్రం వదిలి పెట్టే అవకాశాలు కనిపించడం లేదు. వైసీపీ హయాంలో విజయసాయిరెడ్డి నేతృత్వంలో జరిగిన ప్రతి దందాను బయటకు తీసి.. అరబిందో దోపిడీని ..దాని వెనుక ఉన్న బినామీలను. జైలుకు పంపడం ఖాయంగా కనిపిస్తోంది.