ప్రతిపక్షంలోకి మారిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు.. తొలి సారి ఓ సుదీర్ఘ యాత్ర ప్రారంభించబోతున్న సమయంలో.. ఆయన భద్రత తగ్గింపు వ్యవహారం చర్చనీయాంశమవుతోంది. చంద్రబాబు భద్రతను తగ్గించారని.. ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు బయట పెట్టారు. చంద్రబాబు భద్రతా సిబ్బంది సంఖ్యను ఏకపక్షంగా 146 నుంచి 67కు తగ్గించారని ఆరోపించారు. తీవ్రవాదుల బెదిరింపు ఎదుర్కొంటున్న లోకేష్‌కు కూడా భద్రతను తగ్గించారని.. రాజకీయా కారణాల వల్ల.. ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు కుటుంబానికి ప్రాణహానీ ఉందన్న ఆధారాలు పోలీసుల వద్ద ఉన్నాయని … గతంలో ఉన్న భద్రతా స్థాయిని పునరుద్ధరించాలని కళా వెంకట్రావు డిమాండ్ చేశారు.
చంద్రబాబు భద్రత వ్యవహారం … ప్రభుత్వం మారిన తర్వాత కూడా చర్చనీయాంశమయింది. అప్పట్లో ప్రభుత్వం దాదాపుగా భద్రతను పూర్తిగా తగ్గించేయడంతో.. ఆయన కోర్టుకెళ్లారు. భద్రతను గతంలలోలా కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.దాంతో వివాదం సద్దుమణిగిందని అనుకున్నారు అయితే.. హఠాత్తుగా ఆయన మళ్లీ భద్రతను తగ్గించినట్లుగా టీడీపీ ఆరోపిస్తోంది. చంద్రబాబు ప్రజల్లోకి వెళ్లాలని షెడ్యూల్ ఖరారు చేసుకున్న తర్వాతనే ఇలా తగ్గించడం.. ఖచ్చితంగా.. కావాలనే చేశారని టీడీపీ వర్గాలంటున్నాయి.
గతంలో లోకేష్.. పర్యటనల్లో.. భద్రతా లోపాలు బయటపడినప్పుడు ఆయన భద్రత పెంచాలని ఎనిమిది సార్లు లేఖలు రాశారు. అయితే.. కొద్ది రోజుల కిందట.. భద్రతను వన్ ప్లస్ వన్ కు తగ్గించారు. మొదట్లో.. జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడది.. వన్ ప్లస్ వన్ కు తగ్గిపోయింది. ఇతర చంద్రబాబు కుటుంబసభ్యులకు భద్రతను గతంలోనే పూర్తిగా తొలగించారు.