చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆయన గత ఎన్నికల్లో బీఆర్ఎస్తరపున పోటీ చేసి అతి స్వల్ప తేడాతో గెలిచారు. రెండు రోజుల కిందట ఆయన ఓ ప్రభుత్వ భవనం కార్యక్రమంలో పట్నం మహేందర్ రెడ్డితో కూడా గొడవపడ్డారు. కానీ శుక్రవారం ఉదయం ఢిల్లీకి వెళ్లిపోయి.. కాంగ్రెస్ కండువా కప్పించేసుకున్నారు. కాలే యాదయ్య మొదట కాంగ్రెస్ నేత. సబితా ఇంద్రా రెడ్డి కుటుంబం ఎంత చెబితే అంత. కానీ ఇప్పుడు సబితను కాదని కాంగ్రెస్ లో చేరిపోయారు.
చేవెళ్ల రిజర్వుడు సీటు కాక ముందు ఇంద్రారెడ్డి కంచుకోటగా ఉండేది. ఆయన చనిపోయిన తర్వతా సబితా ఇంద్రారెడ్డి పోటీ చేస్తూ వస్తున్నారు. రిజర్వుడు అయిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరంకు మారిపోయారు. కానీ చేవెళ్లలో మాత్రం ఎవర ఎమ్మెల్యేగా ఉండాలో ఆ కుటుంబమే డిసైడ్ చేస్తూ వస్తోంది. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు కాలే యాదయ్యకు సీటు ఇప్పించి గెలిపించారు. 2014లో గెలిచిన తర్వాత ఆయన బీఆర్ఎస్ లోచేరిపోయారు. 2018లో కూడా గెలిచారు. ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి కూడా పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో గెలిచినా ఆయన ఉక్కపోతే తట్టుకోలేక కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
ఆయన పార్టీ మారకుండా ఉండేందుకు కేసీఆర్ ఫామ్ హౌస్ కు పిలిపించుకుని బుజ్జగించారు. మరో రెండు, మూడు నెలల్లో సినిమా అంతా మారిపోతుందని మళ్లీ బీఆర్ఎస్ కు ఊపని చెప్పారు. అప్పుడు తల ఊపి వచ్చిన ఆయన ఇప్పుడు .. ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ కండువా కప్పేసుకున్నారు.