కల్కి సెన్సార్ పూర్తి చేసుకుంది. సినిమాకి U/A సర్టిఫికేట్ వచ్చింది. నిడివి 2 గంటల 58 నిమిషాలు. అంటే దాదాపు మూడు గంటలు. ఇప్పడు యావరేజ్ గా చూసుకుంటే ఈ రన్ టైం ఎక్కువే. అయితే కల్కి కాన్వాస్ పెద్దది. ప్రభాస్, అమితాబ్, కమల్ హాసన్, దీపిక, దిశా పటాని, ఇలా బోలెడు తారాగణం వుంది. పైగా ఈ సినిమా అన్ని పురాణాలకు ఒక ముగింపుని చెబుతున్నాడు నాగ్ అశ్విన్. అంటే అంత పెద్ద కాన్వాస్ ని చెప్పాలంటే ఖచ్చితంగా నిడివి కావాల్సిందే.
ఎక్కువ నిడివి అనేది పెద్ద సమస్య కాదని యానిమల్ నిరూపించింది. మూడు గంటల ఇరవై నిమిషాల రన్ టైం తో వచ్చింది యానిమల్. ఈ రన్ టైమ్ గురించి తెలిసి మొదట అంతా ఆశ్చర్యపోయారు. అసలు అంత సమయం థియేటర్ లో కూర్చోవడం సాధ్యమేనా ? అనే కామెంట్లు వచ్చాయి.
సినిమా విడుదలైన తర్వాత కూడా నిడివిపై కొన్ని ఫిర్యాదులు వచ్చాయి. సినిమాని ఇంకాస్త షార్ఫ్ గా చేయాల్సిందనే కామెంట్లు వినిపించాయి. కానీ సందీప్ వంగా వెనక్కి తగ్గలేదు. అంత నిడివితోనే సినిమా బాక్సాఫీసు వద్ద మంచి నెంబర్సే కలెక్ట్ చేసింది. యానిమల్ తో పోల్చుకుంటే కల్కి స్కేల్ వేరు. కాకపొతే ఎంత యంగేజింగా తీశారనేదానిపైనే అంతా ఆధారపడి వుంటుంది.