రాజమౌళి సినిమాలో ఏదో ఓ కొత్త ఆయుధం కనిపిస్తుంది. ఆ ఆయుధం హీరో చేతికి వస్తే.. హీరోయిజం నెక్ట్స్ లెవిల్ లో ఎలివేట్ అవుతుంది. శత్రు సంహారం పూర్తవుతుంది. రాజమౌళి ఫార్ములాని చాలామంది దర్శకులు ఫాలో అయ్యారు. అవుతున్నారు. ఖైది, విక్రమ్, యానిమల్ తదితర చిత్రాల్లో భారీ మిషన్ గన్లను చూసే అవకాశం వచ్చింది. ఇప్పుడు ‘కల్కి’ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ ఏకంగా ఓ గన్నుల ఫ్యాక్టరీనే తెరిచేశాడు.
ప్రభాస్ – నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపుదిద్దుకొంటున్న చిత్రం ‘కల్కి’. దీనిపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నాడు నాగ్ అశ్విన్. సైన్స్‌కి పురాణాల్ని మిక్స్ చేసిన కథ ఇది. టైమ్ మిషన్ లోకి వెళ్లి మరీ భవిష్యత్తుని ఆవిష్కరించబోతున్నాడు. రానున్న రోజుల్లో టెక్నాలజీ ఎంతలా మారిపోతుందో ఊహించడం కష్టం. నాగ్ అశ్విన్ మాత్రం ఊహించడమే కాకుండా, దానికి ఓ దృశ్య రూపం కూడా ఇవ్వబోతున్నాడు.
ముఖ్యంగా ఇప్పటి వరకూ మనం చూడని ఆయుధాల్ని తయారు చేశాడు. అందుకోసం గన్నుల ఫ్యాక్టరీనే తెరిచాడు. ఇందుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ మేకింగ్ వీడియో వదిలారు. గన్నుల కోసం ఆర్ట్ డిపార్ట్ మెంట్ ఎంతలా కష్టపడిందో ఈ వీడియోలో చూపించారు. ‘గన్ను గన్నులా ఉండకూడదు’ అనే నియమంతో.. ఈ గన్నుల్ని తయారు చేసింది చిత్రబృందం. ‘ఇంతకీ గన్ను పేలుతుందా, లేదా’ అంటూ తమపై తాము సెటైర్లు కూడా వేసుకొన్నారు. మొత్తానికి ‘వావ్’ అనిపించే ఓ వార్ ఎపిసోడ్ కి నాగ్ అశ్విన్ అండ్ కో.. రంగం సిద్ధం చేసినట్టు స్పష్టంగా తెలుస్తోంది. మొత్తానికి నాగ్ అశ్విన్ ‘కల్కి’కి సంబంధించిన అప్ డేట్లతో హోరెత్తిస్తున్నాడు. ఈ వీడియో చూశాక.. ‘కల్కి’పై మరిన్ని అంచనాలు పెరగడం ఖాయం.
The gun should not look like a gun at all. ?
Presenting '???? ??????? ??????? ?: ??-????????? ?? ????': https://t.co/hCDRlcd5t4#Kalki2898AD #Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/RjglMlE8GK
— Kalki 2898 AD (@Kalki2898AD) December 30, 2023