వివేకా హత్యకేసులో జగన్ రెడ్డిని అడ్డంగా ఇరికించిన కల్లాం అజేయరెడ్డి వ్యవహారం కీలక మలుపు తిరిగింది. ఆయన సీబీఐకి ఇచ్చిన స్టేట్మెంట్ చిట్ చాట్ కాదని.. నిబంధనల ప్రకారం రికార్డు చేసిన వాంగ్మూలం అని సీబీఐ .. హైకోర్టుకు తెలిపింది. తన వాంగ్మూలంపై రకరకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ.. తాను చెప్పినవి రాసుకోలేదని.. ట్యాంపర్ చేశారని.. ఏదేదో ఆరోపిస్తూ… హైకోర్టులో పిటిషన్ వేశారు. తన వాంగ్మూలాన్ని తీసేయాలని సీబీఐని ఆదేశించాలని కోరారు. కానీ నిజాలు మాత్రం బయటకు వచ్చాయి.
సీబీఐ చార్జిషీట్ లో పేర్కొన్నదేంటి అనే విషయంపై కూడా పూర్తి క్లారిటీ లేదని .. పత్రికల్లో చూసి తాను ఆ విషయం తెలుసుకున్నానని, అది కూడా పూర్తిగా వక్రీకరించారని దాన్ని తొలగించాలని అజేయకల్లాం వాదించారు ఇతరులను కేసులో ఇరికించే ధోరణితోనే సీబీఐ తన వాంగ్మూలాన్ని తప్పుగా పేర్కొన్నదని ఆయన అంటున్నారు. అందుకే దాన్ని చార్జిషీట్ నుంచి తొలగించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సీబీఐ అధికారులు నోటి మాటగా వాంగ్మూలాలు రికార్డు చేయరు. ఖచ్చితంగా రికార్డు చేసుకునే ఉంటారు. అదే జరిగిందని సీబీఐ కోర్టుకు తెలిపింది. . మొత్తం కేసులో అజేయకల్లాం వాంగ్మూలం మలుపు తిప్పినట్లేనని చర్చ జరుగుతోంది. ఇటీవల అజేయకల్లాంకు సలహాదారు పదవి కూడా పొడిగించారు. వివేకా హత్య గురించి అందరికీ ఆరింటికి తెలిస్తే.. జగన్ రెడ్డికి అంతకంటే రెండు గంటల ముందే తెలుసని… అజేయరెడ్డి వాంగ్మూలం ఇచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.