ఢిల్లీ లిక్కర్ స్కాంలో కల్వకంట్ల కవితకు నిందితరాలిగానే గుర్తించి నోటీసులు జారీ చేసింది.గతంలో సాక్షిగా నోటీసులు ఇచ్చారు. కానీ ఇప్పుడు నిందితురాలిగా చేర్చినట్లుగా కోర్టుకు తెలిపారు. 41ఏ కింద నోటీసులు ఇచ్చారు. గతంలో సీబీఐ అధికారులు విచారణ ముగించుని వెళ్తూ కవితకు మరో నోటీసు ఇచ్చారు. ధ్వంసం చేసిన ఫోన్లు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన డాక్యుమెంట్లు ఇవ్వాలని ఆ నోటీసులో ఉంది. ఇవి ఆ కేసులో సాక్ష్యాల కిందకు వస్తాయి. ఆమె వద్ద ఖచ్చితంగా ఉన్నాయని నిరూపణ చేసుకునే సీబీఐ ఈ నోటీసులు జారీ చేసింది.
మళ్లీ విచారణ ఎప్పుడు అన్నది గత విచారణలో సీబీఐ తేదీ ఇవ్వలేదు. త్వరలోనే అని సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పటి వరకూ మళ్లీ విచారణకు పిలవలేదు. ఈ మధ్య కాలంలో చాలా మంది నిందితులు అప్రూవర్లుగా మారారు. వారు ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా మరిన్ని ఆధారాలతో కవితను నిందితురాలిగా చేర్చారు. ఈ సారి ఇంటికి వచ్చి విచారణ జరిపే అవకాశం లేదు . ఢిల్లీ వెళ్లి హాజరు కావాల్సి ఉంటుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో సీబీఐ కానీ.. ఈడీ కానీ ఆషామాషీగా ఏమీ చేయడం లేదని.. ప్రణాళికాబద్దంగానే చేస్తున్నారన్న అభిప్రాయాలు ఇలాంటి కేసుల్లో పండిపోయిన వారి అభిప్రాయంగా వినిపిస్తోంది. ముందు ముందు కవితకు ఈ కేసులో చిక్కులు పెరిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. లిక్కర్ స్కామ్‌లో నిందితులుగా పేర్కొన్న అందర్నీ సీబీఐ అరెస్టు చేసింది. అందుకే.. ఇప్పుడు కవితను కూడా అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే కవిత విచారణకు వెళ్తారా లేదా అన్నది కీలకంగామారింది.