కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. అదానీ విషయంలో మోదీపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసిన ఆమె ఒక్క రోజులోనే యాక్టివ్ అయిపోయారు. జాగృతి పేరుతో గతంలో తన వెంట నడిచి చెల్లా చెదురు అయిపోయిన నేతల్ని మళ్లీ పిలిపించుకుని తన ఇంట్లో సమావేశం నిర్వహించారు. తెలంగాణ జాగృతి తరపున బీసీ కమిషన్ కు త్వరలోనే నివేదిక సమర్పిస్తామని ప్రకటించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకునేందుకు అంటూ పెట్టిన జాగృతిని లిక్కర్ స్కామ్లో అరెస్టు చేసే ముందు మహిళా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసే సంస్థగా మార్చారు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ ఉద్యమం చేసేందుకు తెరపైకి తెచ్చారు.
తెలంగాణ జాగృతిని కవిత భారత రాష్ట్ర సమితితో పాటు భారత జాగృతిగా మార్చేశారు. లోగోలు విడుదల చేశారు. హంగామా చేశారు. కానీ ఇప్పుడుడ బీఆర్ఎస్ ను టీఆర్ఎస్గా మార్చక ముందే తన భారత జాగృతిని తెలంగణ జాగృతిగా మార్చేసి..రాజకీయ పోరాటం ప్రారంభిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టింది. బీసీ కమిషన్ నియమించింది. కులగణనలో వచ్చే వివరాల ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతామని అంటోంది. కాంగ్రెస్ ఏం చెబుతోందో.. అదే చేయాలని డిమాండ్ చేస్తూ కవిత వినతి పత్రం ఇచ్చేందుకు రెడీ కావడం కాస్త ఆశ్చర్యరమే.
కానీ కవిత రాజకీయం అలాగే ఉంటుందని ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయో తెలుసుకుని వాటి కోసం పోరాడినట్లుగా కలరింగ్ ఇచ్చి చేసిన తరవాత తమ పోరాటమేేనని చెప్పుకునేలా ఉటుందని ఉంటున్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు అంశంపైనా ఇలాగే స్పందించారని అంటున్నారు. ఆమె రాజకీయ వ్యూహాలు ఎలా ఉన్నా.. మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ కావడం మాత్రం ఖాయమని తాజా డెవలప్మెంట్తో స్పష్టమవుతోంది.