అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా, పులివెందుల ప్రజల తీర్పును అవమానిస్తున్న జగన్ రెడ్డిని ప్రశంసించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తనకు జగన్ అంటే అభిమానమని, మంచి ఫైటర్ అని కొనియాడారు. ప్రతిపక్ష నాయకుడిగా మంచి ఫైట్ చేస్తున్నాడని కవిత చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
బీఆర్ఎస్ – వైసీపీ మధ్య ఐదేళ్లు సఖ్యత ఉన్నది. కేసీఆర్ సూచనలను జగన్ పాటించేవారని విమర్శలూ ఉన్నాయి. కారణం అదేనో మరేమిటో కానీ , జగన్ అపోజిషన్ లీడర్ గా సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారని కితాబిచ్చారు కవిత. ప్రతిపక్షంలో జగన్ చేసిన పోరాటం ఏంటో ఏపీ ప్రజలకు కూడా తెలియదు.
ఏపీలో ఎవరైనా చనిపోతే తప్ప బెంగళూరును వదిలి, ప్రజల్లోకి రావడం లేదు జగన్. అసెంబ్లీకి సైతం డుమ్మా కొడుతున్నారు. అనర్హత వేటు పడకుండా ఉండేలా ఒకరోజు అసెంబ్లీకి హాజరై పొలోమని బెంగళూరు వెళ్తున్నారు.
పలు విషయాల్లో ఇప్పటికీ కేసీఆర్ ను జగన్ ఫాలో అవుతున్నట్టే కనిపిస్తున్నారు. ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఫామ్ హౌజ్ కు పరిమితమైతే, జగన్ యలహంక ప్యాలెస్ లో చిల్ అవుతున్నారు. ఇద్దరి మధ్య కొన్నింటిలో సారూప్యత ఉండటంతోనే జగన్ పై కవిత ప్రశంసలు కురిపించిందనే అభిప్రాయం వినిపిస్తోంది.