ప్రతి వ్యక్తి నిత్యం ఎన్నో సమస్యలతో సతమతమౌవుతూ బ్రతుకుబండిని లాగిస్తూనే ఉంటాడు.ఈ క్రమంలో కొందరికి సమస్యలను ఎదుర్కోలేని శక్తిని ఇస్తు ఉంటాడు భగవంతుడు.అలాగే ఆ సమస్యలకు పరిష్కార మార్గం చూపించి భగవంతుడు అనేవాడు మనుషుల మధ్యలోనే ఉన్నాడని కోంతమంది మనుషులను ఉదాహారణగా చూపి ఆ వ్యక్తులను అందరికి ఆదర్శప్రాయంగా నిలిచే లాగా చేస్తాడు అదే భగవంతుడు.అటువంటి ఆదర్శాలతో ఆదర్శంగా నిలిచే వ్యక్తిగా తన పేరు చేర్చుకున్నారు..ప్రముఖ నిర్మాత కల్వకుంట్ల తేజేశ్వర్ రావు . అవిభక్త కవలలైన వీణా -వాణి ఆపరేషన్ కోసం ఆపద్భాందవుల సహాయం కోసం అర్థిస్తున్న వీణా-వాణి తండ్రి మారగాని మురళి (బీరిశెట్టి గూడెం , నరసింహాపేట ,వరంగల్ జిల్లా…) కి కల్వకుంట్ల తేజేశ్వర్ రావ్ నిర్మించే ‘షీ ‘ చిత్రం ప్రారంభోత్సవ వేడుక సందర్భంగా మీడియా సమక్షంలో 3 లక్షల రూపాయాలను అందించి అందరికి ఆదర్శంగా నిలిచారు. షీ పాత్రలో శ్వేతమీనన్ నటిస్తున్న ఈ చిత్రంలో మహాత్ రాఘవేంద్ర , చేతన ఉత్తేజ్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈచిత్రాన్ని పర్స రమేష్ మహేంద్ర తెరకెక్కిస్తున్నాడు.