అందమైన కుటుంబంలో ఆమె బలహీన వ్యక్తిత్వం… బంధాలకు విలువనీయని మనస్థత్వం ఇప్పుడామెను ఒంటరిగా నిలబెట్టాయి. నిన్నటిదాకా అమ్మ అని పిలిచే బిడ్డ.. ప్రేమగా చూసుకునే భర్త కళ్ల ఎదురుగా ఉండేవారు. తాను చేసిన తప్పు కారణంగా… ఇప్పుడు ఆ ఇద్దర్నీ కోల్పోయింది. కొద్ది రోజుల క్రితం.. హైదరాబాద్ శివారులోని ఇస్మాయిల్ ఖాన్ పేట అనే గ్రామంలో జరిగిన ఐదేళ్ల పాప ఆద్య హత్య ఘటన తర్వాత మనస్థాపానికి గురై తండ్రి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆద్య తండ్రి కల్యాణ్.. రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు.
ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న అనూష, కళ్యాణ్ … అన్యోన్యంగానే ఉండేవారు. కల్యాణ్ గ్రామ కార్యదర్శిగా పని చేస్తున్నారు. వారికి ఐదేళ్ల పాప ఉంది. అయితే కల్యాణ్ విధుల్లోకి వెళ్లిన తర్వాత … అనూష చేసే పనులు దారి తప్పేలా చేశాయి. సోషల్ మీడియా ప్రభావంతో.. అందులో పరిచయమైన ఇద్దరితో చాటింగ్ చేస్తూ… వివాహేతర బంధం వరకూ వెళ్లేలా తెచ్చుకుంది. రాజశేఖర్, కరుణాకర్ అనే ఆ ఇద్దరూ… ఒకరికి తెలియకుండా ఒకరు అనూషతో సంబంధం కొనసాగించేవారు. కొన్ని రోజుల తర్వాత ఇద్దరిలో కరుణాకర్‌కి .. అనూష తనను నిర్లక్ష్యం చేస్తోందన్న అనుమానం వచ్చింది. ఓ రోజు అనూషను కలిసేందుకు వచ్చిన సమయంలో రాజశేఖర్ కూడా ఇంట్లో ఉండటంతో కత్తితో దాడికి దిగాడు. వారు బాత్రూమ్లో దాక్కోవడంతో.. చేతికి అందిన పాప గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన సంచలనం సృష్టించింది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య తనను మోసం చేసి.. ఇద్దరితో వివాహేతర బంధం పెట్టుకోవడమే కాదు… ఆ బంధం కారణంగా.. తన బిడ్డ బలైపోవడంతో… అనూష భర్త కల్యాణ్ తట్టుకోలేకపోయాడు. ఘటన జరిగినప్పటి నుండి అదో రకంగా ఉన్న కల్యాణ్… విధులకు వెళ్తున్నాని చెప్పి.. వెళ్లి రైలు కింద పడి ప్రాణం విడిచాడు. అనూష.. ఇలా వివాహేతర బంధాలు పెట్టుకుందని.. భర్త లేని సమయంలో… వాళ్లు ఇంటికి వచ్చి వెళ్తున్నారని కల్యాణ్‌కు తెలియదని పోలీసులు ప్రకటించారు.
మానవ సంబంధాల గురించి ఏ మాత్రం.. అవగాహన లేని తనంతో.. అనూష లాంటి వాళ్లు చేసే పనుల వల్ల… మొత్తం కుటుంబమే చిన్నాభిన్నం అవుతుంది. ఇప్పుడు ఆమె బిడ్డను..భర్తును పోగొట్టుకుని ఒంటరిగా మిగిలింది. అయిన వాళ్లను పోగొట్టుకోవడమే కాదు.. ఆమె జీవితం.. కూడా నాశనం అయిపోయింది.