కల్యాణ్ దిలీప్ – జనసేన అభిమానులకి సుపరిచితమైన పేరు ఇది. నాలుగేళ్లుగా పార్టీకోసం అహర్నిశలు పనిచేసిన వ్యక్తుల్లో కల్యాణ్ దిలీప్ ఒకరని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జనసేన పార్టీ తరపున ప్రతినిధులెవరూ లేని సమయం లో గత నాలుగేళ్ళూ ప్రతి మీడియాలోనూ తన స్వంత ఖర్చులతో వెళ్ళి అన్ని డిబేట్లలోనూ జనసేన తరపున మాట్లాడిన వ్యక్తి. మంచి వాగ్ధాటి తో ఎన్నో విమర్శలు తిప్పికొట్టాడు. ఒకానొక టైం లో సాక్షి డిబేట్ లో కొమ్మినేని కూడా నీలాంటి వ్యక్తి దొరకడం పవన్, జనసేన అదృష్టం అన్న సందర్భం ఉంది. ఇప్పుడదే కళ్యాణ్ దిలీప్ జనసేన లోని కొందరు వ్యక్తుల మీదా, ప్రత్యేకించి మీడియా పి.ఆర్.ఓ ల మీద దుమ్మెత్తుతూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేయడం సంచలనం అయింది. జనసేన లో అధికార ప్రతినిధులని ప్రకటించగానే ఇక్కడా ప్రజారాజ్యం రాజకీయాలు షురూ అయ్యాయా అన్న సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. ఇంతకీ కళ్యాణ్ దిలీప్ ఏమన్నాడంటే-
“పార్టీ ఆఫీస్ వ్యక్తుల చెంచాలు శృతి మించి వ్యాఖ్యానాలు చేస్తే నేను రోడ్ ఎక్కుతా.. ఆల్రెడీ విసిగి విసిగి ఉన్నా కనుక ఎవరి పనులు వారు చేసుకుంటూ అందరికి మంచిది.. కత్తి మహేష్ ని నేనే ఎగద్రోసి, నేనే చల్లార్చానని జనసేన లో కొత్తగా వచ్చిన వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారు. టిడిపి నుంచి డబ్బు తీసుకున్నానని అంటున్నారు. చిల్లిగవ్వ తీసుకోకుండా స్వంత ఖర్చులతో పనిచేసా. ఒక్కసారి పవన్ పిలిచి శభాష్ అంటే చాలని ఆశపడ్డా. కానీ ఆయన నుంచి పిలుపు రాకపోగా, అలా రాకపోవడానికి కారణం నా గురించి నెగటివ్ గా పవన్ దగ్గర ఏదో ఫైల్ ఉందంటూ జనసేనలోని వ్యక్తులు దుష్ప్రచారం చేస్తున్నారు. నాకు పార్టీకి సంబంధం లేదని మీడియా చానెల్స్‌కి ఫోన్ చేసి చెప్పే మీడియా హెడ్.. పి.ఆర్.ఓ వేణు. ఇదే ముక్క 48 గంటల్లో ప్రెస్ నోట్ ఇప్పిస్తే.. ఈ జన్మలో జనసేన మొహం కూడా చూడను.. ప్రెస్ నోట్ ఇప్పించి నన్ను ఈ మానసిక వ్యధ నుండి విముక్తుడిని చేస్తే మీకు రుణపడి ఉంటా.. నా బ్రతుకు నేను బ్రతుకుతా..”
మొత్తానికి లేకలేక అధికార ప్రతినిధులని ప్రకటిస్తే, అంతలోనే లుకలుకలు బయటపడటం ఆశ్చర్యకరం!!!