నటసార్వభౌమ నందమూరి తారకరామారావు నట వారసుడిగా, తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి నట వారసుడిగా వెండితెరపై అడుగు పెట్టారు హరికృష్ణ. ‘శ్రీకృష్ణావతారం’లో బాలనటుడిగా, తరవాత ‘దాన వీర సూర కర్ణ’లో అర్జునుడుగా తండ్రితో కలిసి హరికృష్ణ నటించారు. ఆయన నట వారసులుగా కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. హరికృష్ణ ‘సీతయ్య’, ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’ సినిమాలు చేస్తున్న టైమ్‌లో తనయులు ఇద్దరూ హీరోలుగా వచ్చారు. అప్పట్లో ఈ ముగ్గురితో కలిసి దర్శకుడు వైవిఎస్ చౌదరి ఓ సినిమా తీయాలని సన్నాహాలు చేశారు. ఎన్టీఆర్, ఏయన్నార్ నటించిన ‘గుండమ్మ కథ’ స్ఫూర్తితో ఓ కథ సిద్ధం చేశారు. ‘బొమ్మరిల్లు’ సంస్థలో తనయులతో కలిసి సినిమా చేస్తానని హరికృష్ణ మాట కూడా ఇచ్చార్ట. అయితే… అనివార్య కారణాల వలన సినిమా ప్రారంభం కాలేదు. అందువల్ల హరికృష్ణతో తనయులను తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు దక్కలేదు.