పటాస్ తరవాత ఆ స్థాయి విజయం కల్యాణ్ రామ్‌కి దక్కలేదు. ఎం.ఎల్.ఏ ఓకే అనిపించింది. నానువ్వే బాగా నిరాశ పరిచింది. ఇప్పుడు గుహన్ దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. నివేధా ధామస్, షాలినీ పాండే కథానాయికలు. షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. డిసెంబరులో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. కానీ.. మంచి సీజన్ కాదని.. ఈ నిర్ణయాన్ని వాయిదా వేసినట్టు సమాచారం. జనవరిలో ఎలాగూ పెద్ద సినిమాలున్నాయి కాబట్టి, ఆ హడావుడి ముగిసిన తరవాత మెల్లగా వద్దామన్నది ప్లాన్. బహుశా ఫిబ్రవరిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ దీపావళికి ఫస్ట్ లుక్ విడుదల చేద్దామనుకున్నారు. కానీ… విడుదలకు ఇంకా సమయం ఉంది కదా అని ఫస్ట్ లుక్‌నీ దాచేశారు. టైటిల్ గురించి కసరత్తు జరుగుతోంది. ఈ సినిమాకి ఓ వెరైటీ టైటిల్ పెడదామన్నది చిత్రబృందం ఆలోచన. అంకెని టైటిల్‌గా ఫిక్స్ చేద్దామని కూడా అనుకుంటున్నారు. `118` లాంటి కొన్ని అంకెలు టైటిల్ కోసం పరిశీలిస్తున్నారు. ఈ అంకెలకూ కథకూ ఉన్న సంబంధమే… సినిమాకి కీలకం. అంకె కంటే.. కథకు యాప్ట్‌గా అనిపించే టైటిల్ దొరికితే దాన్ని ఫిక్స్ చేద్దామకుకుంటున్నార్ట. ప్రస్తుతానికి ఈ టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. ఇదో థ్రిల్లర్. అలాంటి కథలకు ఇలాంటి టైటిళ్లు యాప్ట్ అవుతాయి కూడా. మరి 118అన్నది గది నెంబరా? ఖైదీకి ఇచ్చే నెంబరా? లేదంటే మరోటేదైనా ఉందా? అనేది తెలియాలంటే ఇంకొంత కాలం ఆగాలి.