ప‌వ‌న్ సాధినేనితో క‌ల్యాణ్ రామ్‌

ప్రేమ – ఇష్క్ – కాద‌ల్ తో ఆక‌ట్టుకొన్న ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ సాధినేని. ఆ త‌ర‌వాత కొన్ని ఫ్లాపులొచ్చాయి. అయితే ఇటీవ‌ల ఓటీటీ సీరీస్‌ల‌తో త‌న ప్ర‌భావం చూపించ‌గ‌లిగాడు. సేనాప‌తి, ద‌య సిరీస్‌లు ప‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలోనే వ‌చ్చాయి. దాంతో ఇప్పుడు మ‌ళ్లీ టాలీవుడ్ హీరోల నుంచి పిలుపు అందుకొంటున్నాడు. క‌ల్యాణ్ రామ్ కోసం ప‌వ‌న్ ఓ క‌థ సిద్ధం చేసిన‌ట్టు స‌మాచారం. ఈ కాంబో ఆల్మోస్ట్ ఓకే అయిపోయిన‌ట్టే. నిజానికి నాలుగేళ్ల క్రిత‌మే ప‌వ‌న్ సాధినేని క‌ల్యాణ్ రామ్ కోసం ఓ క‌థ రెడీ చేశాడు. అందులో… హ‌రికృష్ణ కూడా న‌టించాల్సివుంది. కానీ హ‌రికృష్ణ హ‌ఠాన్మ‌ర‌ణంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది. అప్ప‌టి నుంచీ.. ప‌వ‌న్ – క‌ల్యాణ్ రామ్ ట‌చ్‌లోనే ఉన్నారు. ఇప్పుడు అదే మ‌ల్టీస్టార‌ర్ క‌థ‌ని.. క‌ల్యాణ్ రామ్ తో తీస్తున్నారా, లేదంటే.. మ‌రో కొత్త క‌థ త‌యారు చేసుకొన్నాడా? అనేది తెలియాల్సివుంది. ఒక‌వేళ మ‌ల్టీస్టార‌ర్ క‌థే అయితే హ‌రికృష్ణ స్థానంలో మ‌రో హీరోని వెద‌కాల్సిందే. క‌ల్యాణ్ రామ్ ప్ర‌స్తుతం డెవిల్ అనే ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నాడు. బింబిసార 2 కూడా ప‌ట్టాలెక్కాల్సివుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

డి-ఏజింగ్… లాభమా? నష్టమా ?

సినిమాలో ఒక క్యారెక్టర్ బాల్యం, యవ్వనం, కౌమార, ప్రౌడ దశలని చూపించడం ఫిల్మ్ మేకర్స్ కి పెద్ద సవాల్. ఇందుకోసం హలీవుడ్ నుంచి కూడా మేకప్ మ్యాన్ లని దిగుమతి చేసుకునే వారు....

దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో దివ్వెల మాధురీ !

దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో కొత్త కొత్త ఎపిసోడ్లు ప్రారంభమవుతున్నాయి. కొద్ది రోజుల పాటు సైలెంట్ గా ఉంటానని చెప్పిన దివ్వెల మాధురీ.. ఒక్క సారిగా.. ఏకంగా దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లోనే ప్రత్యక్షమయ్యారు. దువ్వాడ...

ఆ పడవలు నందిగం సురేష్ తాలూకానే !

ప్రకాశం బ్యారేజీకి వరద వస్తే ఈ మధ్య బోట్లు కొట్టుకు వస్తున్నాయి. బ్యారేజని డ్యామేజ్ చేస్తున్నాయి. అవి ఎలా వస్తున్నాయో తెలియడం లేదు. ఇప్పుడు మిస్టరీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. వైసీపీ రంగులేసిన...

శభాష్ నిమ్మల… అభినందించిన నారా లోకేష్

భారీ వర్షానికి తోడు బుడమేరకు పడిన గండ్లు విజయవాడను ముంచేత్తాయి. కనీవినీ ఎరుగని స్థాయిలో వరద పోటెత్తడంతో విజయవాడ గత ఆరు రోజులుగా వరదలో నానుతోంది. బుడమేరుకు పడిన గండ్లు పూడ్చితేనే విజయవాడకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close