టాలీవుడ్లో మల్టీస్టారర్ల పరంపర కొనసాగుతోంది. రెండు కుటుంబాలకు చెందిన హీరోలు సైతం కలసి పని చేయడానికి సిద్దం అవుతున్నారు. అందులో భాగంగా నందమూరి కల్యాణ్ రామ్, సాయిధరమ్ తేజ్‌లు కలసి ఓ సినిమా చేయనున్నారు. ఎ.యస్.రవికుమార్ చౌదరి ఇప్పటికే ఈ ఇద్దరు హీరోల కోసం ఓ పవర్ ఫుల్ స్క్రిప్టు సిద్దం చేశాడు. ఈ చిత్రానికి కె.యస్.రామరావు నిర్మాతగా వ్యవహరిస్తారు. ఈ కథ ముందుగా కల్యాణ్ రామ్ కి వినిపిస్తే.. `మరో హీరో పాత్రకు సాయిధరమ్ తేజ్ ని తీసుకోండి` అని సలహా ఇచ్చినట్టు సమాచారం. సాయిధరమ్ కూడా.. ఈ కథకు ఓకే అనడంతో మల్టీస్టారర్‌కి గ్రీన్ సిగ్నల్ పడినట్టైంది. గత రెండు నెలలుగా ఈ స్క్రిప్టుపై పూర్తి స్థాయి కసరత్తులు చేసిన రవికుమార్… ఇప్పుడు టైటిల్ కూడా నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘రామకృష్ణ’ అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం.
క్రియేటీవ్ కమర్షియల్ పతాకంపై ఈ టైటిల్‌ని ఇటీవలే ఛాంబర్లో రిజిస్టర్ చేయించారు. అది ఈ సినిమా కోసమే అని టాక్. రామ్ గా కల్యాణ్ రామ్, కృష్ణగా సాయిధరమ్ తేజ్ నటించబోతున్నారని తెలుస్తోంది. ఇజం తరవాత కల్యాణ్‌రామ్ చేయబోయే సినిమా ఇదేనని తెలుస్తోంది. కావల్సిందల్లా సాయిధరమ్ డేట్సే. అవి కూడా దొరికేస్తే.. ఈ సినిమా పట్టాలెక్కేసినట్టే. సౌఖ్యం డిజాస్టర్ తో మళ్లీ ఫ్లాపుల్లో పడ్డ రవికుమార్ కెరీర్ సజావుగా సాగాలంటే ఈ రామకృష్ణ హిట్ అవ్వాల్సిందే.