‘ప్రేమ ఇష్క్ కాదల్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయయ్యాడు పవన్ సాధినేని. తొలి సినిమాతోనే మంచి అభిరుచి గల దర్శకుడని పేరుతెచ్చుకున్నాడు. అయితే తర్వాత చేసిన చిత్రాలు సరైన విజయాన్ని ఇవ్వలేదు. అయితే తెలుగులో వెబ్ సిరీస్ లలో తన మార్క్ చాటుకున్నాడు. సేనాపతి మూవీతో పాటు జేడీతో చేసిన దయ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులని బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడు మళ్ళీ ఆయనకి అవకాశాలు పెరుగుతున్నాయి.
కళ్యాణ్ రామ్ కోసం పవన్ సాధినేని ఒక కథను సిద్ధం చేశారు. నిజానికి ఇది నాలుగేళ్ల క్రితం వీరిద్దరూ కలిసి పనిచేయాలి. అందులో హరికృష్ణను కీలక రోల్ కోసం కూడా అనుకున్నారట. అయితే హరికృష్ణ హఠాన్మరణంతో ఆ ప్రాజెక్ట్ ఆగింది. అయితే ఇప్పుడా ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. మరో హీరో పాత్ర కోసం తమిళ స్టార్ విజయ్ సేతుపతిని తీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. దాదాపు సేతుపతి ఖయమైనట్లేనని తెలుస్తోంది. ఖైదీ, ఒకే ఒక జీవితం, జపాన్ చిత్రాలు నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. డెవిల్ తర్వాత కళ్యాణ్ రామ్ చేయబోయే ప్రాజెక్ట్ ఇదే. త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తారు.