పటాస్, ఎం.ఎల్.ఏ సినిమాలతో రేసులోకి వచ్చాడు నందమూరి హీరో కల్యాణ్ రామ్. ఈ రెండు సినిమాలతో బీసీల్లో కల్యాణ్ రామ్ సినిమాకి మంచి గిరాకీ ఏర్పడింది. ఈ ఎఫెక్ట్ నా నువ్వే సినిమాపై పడింది. జయేంద్ర దర్శకత్వం వహిస్తున్న నా నువ్వే షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమా సెట్లో ఉన్నప్పుడే శాటిలైట్ డిజిటల్ రైట్స్ అమ్ముడైపోయాయి. జెమిని టీవీ రూ.4.75 కోట్లతో శాటిలైట్ హక్కుల్ని దక్కించుకుంది. హిందీ రైట్స్ రూపంలో మరో రూ.3 కోట్లు వచ్చాయి. డిజిటల్ రైట్స్ రూపంలో మొత్తంగా రూ.8 కోట్ల వరకూ తన ఖాతాలో వేసుకుందీ సినిమా. తమన్నా కథానాయిక కావడం, టెక్నికల్‌గా పీసీ శ్రీరామ్ లాంటి వాళ్ల సపోర్ట్ దొరకడంతో ఈ సినిమాపై క్రేజ్ పెరిగింది. ఇక ఏరియాల వారిగా… కల్యాణ్‌రామ్ సినిమాకి ఎలాంటి రేటు దక్కుతుందో చూడాలి.