నందమూరి కాంపౌండ్ నుంచి హీరోలు వస్తూనే ఉన్నారు. బాలకృష్ణ ని ఫాలో అవుతూ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, తారకరత్న వచ్చారు. ప్రస్తుతం మోక్షజ్ఞ ఎంట్రీకి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయి. వచ్చే యేడాది ఏప్రిల్‌లో మోక్షజ్ఞ హీరోగా ఓ సినిమా మొదలవుతుంది. ఈలోగా…నందమూరి ఇంటి నుంచి మరో నటుడు బరిలో దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తనే కల్యాణ్ రామ్ తనయుడు శౌర్య రామ్. ఇప్పుడు శౌర్య వయసు పన్నేండేళ్లు.
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రానికి నిర్మాత కూడా కల్యాణ్ రామే. ఇందులో ఓ ఛైల్డ్ ఎపిసోడ్ ఉందట. అందులో శౌర్యరామ్ కనిపించబోతున్నాడని టాక్. వేసవి సెలవలు కాబట్టి శౌర్యకి కూడా టైమ్ పాస్ గా ఉంటుందని కల్యాణ్‌రామ్ భావిస్తున్నాడట. ఫస్ట్ షెడ్యూల్లోనే శౌర్యపై సీన్లు తెరకెక్కిస్తారని టాక్. శౌర్య కనిపించేది రెండు మూడు సన్నివేశాలే అయినా ఆ ఇంపాక్ట్ చాలా ఉంటుందని, ఈ సినిమాలో అదో కీ రోల్ అవుతుందని చిత్రబృందం చెబుతోంది. మరి ఈ నందమూరి వారసుడి ఎంట్రీ ని పూరి ఏ రేంజులో డిజైన్ చేశాడో చూడాలి.