ఈ సంక్రాంతికి పోటీ పడుతున్న మరో సినిమా `కల్యాణం.. కమనీయం`. సంతోష్ శోభన్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని యూవీ కాన్సెప్ట్ సంస్థ నిర్మించింది. ఈ సంక్రాంతికి పెద్ద సినిమాల మధ్య నలిగిపోతుందేమో…? అనుకొంటున్న తరుణంలో `కల్యాణం.. కమనీయం` విడుదలకు ముందే సేఫ్ జోన్లోకి వెళ్లి నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఓటీటీ రైట్స్ `ఆహా` సొంతం చేసుకొంది. ఓటీటీ, డిజిటల్ రెండూ కలిపి రూ.7 కోట్లకు అమ్ముడుపోయింది. ఇప్పుడు థియేటర్ నుంచి వచ్చిందంతా బోనస్ కిందే లెక్క. `కల్యాణం.. కమనీయం` ఓ ఫ్యామిలీ డ్రామా. ఈ సంక్రాంతికి ఇలాంటి సినిమాలకు మంచి గిరాకీ ఉంటుంది.కాబట్టి.. బాక్సాఫీసు దగ్గర కూడా సేఫ్ అయిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 14 వస్తోంది కాబట్టి.. అప్పటికి చిరు, బాలయ్య సినిమాల హడావుడి కాస్త తగ్గుతుంది. మిగిలిన రోజుల్ని `కల్యాణం..` క్యాష్ చేసుకోవొచ్చు. యూవీ బ్రాండ్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్. పైగా ట్రైలర్ కూడా ప్రామిసింగ్గానే ఉంది. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొనే సంక్రాంతికి బాక్సాఫీసు దగ్గర ఇంత పెద్ద పోటీ ఉన్నా కూడా.. యూవీ ఇంత రిస్క్ తీసుకొంది.