తారకరత్న ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న సంగతి తెలిసిందే. ఆయన హెల్ట్ అప్ డేట్ వచ్చి చాలా రోజులైంది. ఈ విషయమై ఎవరూ అధికారికంగా నోరు విప్పడం లేదు. తారకరత్న అవుటాఫ్ డేంజర్ అని పైకి చెబుతున్నా – లోపల ఏదో జరుగుతోందన్న ఫీలింగ్ నందమూరి అభిమానుల్లో కూడా ఉంది. ఇప్పుడు కల్యాణ్ రామ్ మాటలు వింటుంటే.. కొత్త అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈరోజు `అమిగోస్`కి సంబంధించి కల్యాణ్ రామ్ మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ సందర్భంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి విలేకరులు కల్యాణ్ రామ్ ని ప్రశించారు. కానీ దీనికి సమాధానం చెప్పడానికి కల్యాణ్ రామ్ ఇష్టపడలేదు. `అవన్నీ డాక్టర్లు చెబుతారు. మనం చెప్పకూడదు` అని సమాధానం దాటేశారు. తారకరత్న ఆరోగ్యం గురించి… కల్యాణ్ రామ్ కి అప్ డేట్ లేకుండా ఉంటుందా..? కానీ ఏం చెప్పినా, ఎలా చెప్పినా అది సున్నితమైన విషయం. అందుకే కల్యాణ్ రామ్ నుంచి సమాధానం రాలేదు. పూర్తిగా అవుటాఫ్ డేంజర్ అనుకొంటే.. కల్యాణ్ రామ్ కి ఈ విషయం చెప్పడానికి ఎలాంటి అభ్యంతరాలూ ఉండవు. కానీ.. ఆ స్థితి నుంచి తారకరత్న బయటపడి ఉండకపోవొచ్చు. అందుకే కల్యాణ్ రామ్ ఇలా స్పందించాడేమో అనిపిస్తోంది. మొత్తానికి కల్యాణ్ రామ్ కామెంట్లు… తారకరత్న ఆరోగ్య స్థితి గురించి కొత్త అనుమానాలూ, ప్రశ్నలూ రేకెత్తించే విధంగానే ఉంది.