“మక్కల్ నీది మయ్యం” పార్టీ అధినేత … తన విశ్వరూపాన్ని ఎన్నికల ప్రచారంలో చూపిస్తున్నారు. తమిళనాడులో 19వ తేదీన జరగనున్న మూడు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను నిలబెట్టి ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారంలో… గాడ్సే ప్రస్తావన తీసుకు వచ్చారు. ఆయనను.. స్వతంత్ర బారతదేశపు తొలి టెర్రరిస్ట్‌గా అభివర్ణించారు. హిందూ ఉగ్రవాదిగా ఆయన గాంధీని హత్య చేశాడన్నారు. తనకు తాను గాంధీ మనవడిగా అభివర్ణించుకుని… తనకు అలా హక్కు ఉందన్నారు. గాంధీ హంతకుడిగా … దేశ ప్రజల దృష్టిలో విలన్‌గా ఉన్న గాడ్సేను.. హిందూ ఉగ్రవాదిగా.,.. కమల్ హాసన్ అభివర్ణించడం రాజకీయంగా కలకలం సృష్టించే అవకాశం ఉంది.
“గాడ్సే” మొదటి హిందూ టెర్రరిస్ట్ అంటే బీజేపీకి కాలుతుందా..?
భారతీయ జనతా పార్టీకొద్ది రోజులుగా హిందూ ఉగ్రవాదంపై మాట్లాడుతోంది. అలాంటి వాళ్లెవరూ లేరని .. ఆ పార్టీ నేతలు వాదిస్తున్నారు. మాలేగావ్ పేలుళ్ల కేసులో నిందితురాలిగా ఉన్న… సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కి… భోపాల్ టిక్కెట్ కూడా ఇచ్చారు. ఆమెను అన్యాయంగా ఇరికించారని ప్రచారం చేశారు. ఈ క్రమంలో… కమల్ హాసన్.. హిందూ ఉగ్రవాదంపై వ్యాఖ్యలు చేయడం.. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే… గాంధీ మహాత్ముడి ప్రాణాలు తీసుకున్న నాథూరాం గాడ్సే.. ఆరెస్సెస్‌కు చెందిన వ్యక్తేనని.. ప్రచారంలో ఉంది. అదే సమయంలో.. ఆరెస్సెస్ వర్గీయులు.. గాంధీ కన్నా.. గాడ్సేనే ఎక్కువగా అభిమానిస్తారు. గాడ్సే విగ్రహానికి.. మోడీ స్వయంగా… నివాళులు అర్పిస్తున్న ఫోటోలు… ఇంటర్నెట్లో సర్క్యూలేట్ అవుతూనే ఉంటాయి.
మహాత్ముడిని గాడ్సే చంపడానికి కారణాలు మత పరమైనవే..!
మహాత్ముడిని.. గాడ్సే కాల్చి చంపడం వెనుక నేపధ్యం కూడా… మతమేనని ప్రచారంలో ఉంది. దేశ విభజన అనంతర పరిణామాల్లో గాంధీ తీసుకున్న నిర్ణయాలను… గాడ్సే వ్యతిరేకించారని.. మత పర కారణాలతోనే.. గాడ్సే ఉన్మాదిగా మారారన్న ప్రచారం చాలా కాలం నుంచి ఉంది. అయితే.. ఇంత వరకూ.. ఎవరూ గాడ్సేపై టెర్రరిస్ట్ అనే ముద్ర వేయలేదు. మొదటి సారి కమల్ హాసన్ ఆ పని చేశారు. గాడ్సేను… స్వతంత్ర భారత దేశంలో.. మొట్టమొదటి… హిందూ టెర్రరిస్ట్‌గా అభివర్ణించి.. కలకలం రేపారు. ఇది సహజంగానే భారతీయ జనతా పార్టీ నేతలకు నచ్చదు. ఆ పార్టీ జాతీయవాద భావాలున్న వారికి అసలు నచ్చదు.
గాడ్సేను ఆరాధించినా ఖండించలేని స్థితిలో బీజేపీ..!
అయితే.. కమల్ హాసన్.. అత్యంత వ్యూహాత్మకంగా ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవాలి. ఎందుకంటే… భారతీయ జనతా పార్టీ కూడా.. బహిరంగంగా.. నాథూరాం గాడ్సేను వెనకేసుకు వచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికే మహాత్ముడిపై… అంతంతమాత్రం అభిమానం చూపిస్తుందని విమర్శలు ఎదుర్కొంటున్న బీజేపీ.. ఇప్పుడు.. కమల్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తే మరింత ఇరకాటంలో పడుతుంది. అందుకే..గాడ్సేను… బీజేపీ వెనుకేసుకు రావడం కష్టం. అయితే హిందూ ఉగ్రవాది అన్న విషయంలో మాత్రం… కాస్త అడ్వాంటేజ్ తీసుకునే అవకాశం ఉంది. హిందూత్వం అంటే… తాము ఆచరించేదే అనే భావనలు ఉన్న వాళ్లు. కమల్‌పై విమర్శలతో ఎటా చేసే అవకాశం ఉంది. అయితే కమల్ మాత్రం.. ఓ హాట్ టాపిక్‌ను.. ఎన్నికల చివరి దశలో.. తెరపైకి తెచ్చారన్నది మాత్రం స్పష్టం.