కమల్ హాసన్ ‘విక్రమ్’ విజయం ఆయనలో కొత్త జోష్ నింపింది. కమల్ హాసన్ తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలలో స్టార్ హీరో సూర్య గెస్ట్ రోల్ రూపొందిన చిత్రం భాక్సాఫీసు వద్ద రానిస్తుంది. తాజాగా విక్రమ్ విజయాన్ని పురస్కరించుకొని హీరో కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరో సూర్యని ఆయన నివాసంలో కలుసుకొని కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ తన సొంత రోలెక్స్ వాచ్ను సూర్య కి బహుమతిగా ఇచ్చారు. ఈ అరుదైన బహుమతిని సూర్య తన ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ”ఇలాంటి క్షణమే జీవితాన్ని అందంగా మార్చుతుంది. థాంక్స్ అన్నా” అని తన ట్విట్టర్ లో వెల్లడించారు సూర్య. విక్రమ్ లో సూర్య రోలెక్స్ పాత్రలో కనిపించారు. సూర్య స్క్రీన్ ప్రజన్స్ కి సూపర్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.