విశ్వనటుడు, లోకనాయకుడు కమల్ హాసన్ కు ఇప్పటి వరకు ఎన్నో అవార్డులు, రివార్డులు వచ్చిన సంగతి తెలిసిందే.. కెరియర్ మొదలు పెట్టిన నాటినుండి నిరంతరతం కొత్త పాత్రలకు జీవం పోస్తూ ప్రేక్షకులకు తనను తాను కొత్తగా పరిచయం చేసుకుంటూ వస్తున్న కమల్ హాసన్ ప్రేక్షకులకు తన దశావతారాలు చూపించగలిగాడు. సినిమా జానర్ ఏదైనా కమల్ ఎంచుకున్న పాత్రకు నూటికి నూరు పాళ్లు కాదు అంత కన్నా ఎక్కువే న్యాయం చేస్తాడు.
భారత సినిమాకు ఆయన అందించిన సేవలకు గాను పారిస్ లో అరుగైన గొరవం దక్కింది. అత్యంత ప్రతిష్టాత్మక హెన్రీ లాంగ్లోయిస్ అవార్డును సొంతం చేసుకున్నాడు కమల్. తన గురువు అనంతు సార్ ద్వారా హెన్రీ గురించి తెలుసుకున్నాని.. ఇప్పుడు ఆయన పేరు మీద అవార్డ్ తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయమని.. ఈ సమయంలో అనంతు సార్ ఉంటే బాగుండేది అని తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు కమల్ హాసన్. ప్రపంచ చరిత్రలో గుర్తుండి పోయే పెరు హెన్రీ లాంగ్లోయిస్.. ప్రపంచ సిని చరిత్రను కాపడటంలో ఆయన అందరి హృదయాలను గెలుచుకున్నారని గుర్తు చేశారు.