ప్రముఖ నటుడు, దర్శకుడు కమల్‌హాసన్ కాలుకి గాయమైంది. బుధవారం రాత్రి చెన్నైలోని తన కార్యాలయంలో మెట్లపై నుంచి దిగుతుండగా కమల్ జారి పడ్డారు. వెంటనే ఆయన్ని స్థానిక అపోలో ఆస్పత్రికి తరలించారు. కాలికి ఫ్రాక్చర్ అయిందని వైద్యులు ధృవీకరించారు. రెండు వారాల విశ్రాంతి తీసుకోమని కమలన్ని సూచించారట. కమల్ ప్రస్తుతం శభాష్ నాయుడు చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇటీవల అమెరికాలో షూటింగ్ జరిగింది. ఆ షెడ్యూల్ పూర్తయి చెన్నయ్ తిరిగొచ్చాడు కమల్. త్వరలో లండన్‌లో జరగనున్న లండన్ ఇండియన్ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరుకావాల్సి ఉంది. అయితే ఆ పర్యటన కమల్ రద్దు చేసుకొన్నట్టు తెలుస్తోంది.