లోకనాయకుడు విశ్వనటుడు కమల్ హాసన్ కు శివాజి గణేషన్ అంటే వల్లమాలిన అభిమానం. అందుకే తన ప్రతి సినిమాలో ఆయన తనయుడు కోలీవుడ్ ఆర్టిస్ట్ ప్రభుకి అవకాశం కలిప్స్తాడు కమల్. అయితే ఇప్పుడు ప్రభునే కమల్ కు ఓ అద్భుత అవకాశాన్ని కల్పించాడట. వందల కొద్ది సినిమాల్లో నటించినా తన సినిమా అంటే తనని తాను కొత్తగా పరిచయం చేసుకోవాలనే తపన ఉన్న కమల్ హాసన్ ఇప్పుడు ప్రభు సలహా మేరకు ఓ సినిమాలో మాంత్రికుడిగా కనిపించనున్నాడు.
ఇంతవరకు చేయని పాత్ర కాబట్టి ఆ సినిమా మీద కమల్ కూడా కాస్త ఉత్సాహం చూపిస్తున్నాడు. ‘మీన్కుంబం మన్పానయం’ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలో ప్రభు లీడ్ రోల్ చేస్తుండగా.. కమల్ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. అముదేశ్వర అనే యువ దర్శకుడు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా తర్వాత రాజీవ్ కుమార్ దర్శకత్వంలో మరో వినూత్నమైన కథాశంతో తెరకెక్కే సినిమాకు సిద్ధమవుతున్నాడు కమల్ హాసన్. ఈ సినిమాలో కమల్ శృతి హాసన్ లు తండ్రి కూతుళ్లుగా నటించడం విశేషం.