ప్రభాస్ ప్రాజెక్ట్ కెలో మరో అదనపు ఆకర్షణ చేరింది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ దిగ్గజం… అమితాబ్ బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఈ ప్రాజెక్టులో భాగం పంచుకోబోతున్నారు. ప్రాజెక్ట్ కేలో కమల్ నటిస్తున్నారన్న వార్త కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతోంది. అయితే.. చిత్రబృందం మాత్రం నోరు మెదపలేదు. అయితే ఇప్పుడు కమల్ ఎంట్రీని అధికారికంగా ప్రకటించేసింది. ఈ చిత్రంలో కమల్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వైజయంతీ మూవీస్ క్లారిటీ ఇచ్చింది. కమల్ ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా కనిపించనున్నాడని టాక్. అయితే కమల్ విలనా? లేదంటే కథని మలుపు తిప్పే పాత్రా..? అనేది క్లారిటీ లేదు. దీపికా పదుకొణె ఈ చిత్రంలో కథానాయిక. ఈ నెలలోనే టైటిల్ సైతం అఫీషియల్‌గా ఎనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రాజెక్ట్ కె..లో కె అంటే కల్కి అని, టైటిల్ కూడా దాన్నే ఫిక్స్ చేస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. నాగ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకొంటోంది.