గెటప్పులంటే పడిచచ్చే హీరోల్లో కమల్ హాసన్ ఒకరు. ఆయన నటనలోని వైవిధ్యాన్ని బయటకు తీసుకొచ్చేవి అవే. దశావతారంలో పది రూపాల్లో కనిపించి ఆశ్చర్యపరిచారు. ఆ తరవాత మళ్లీ గెటప్పులపై దృష్టి పెట్టలేదు. ‘కల్కి’లో మాత్రం కమల్ మేకొవర్ వేరే రేంజ్లో ఉంది. ఈ సినిమాలో కమల్ హాసన్ ప్రతినాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే కమల్ పాత్రేమిటి? తన గెటప్ ఏమిటన్నది రివీల్ చేయలేదు. కమల్ పాత్రని ప్రత్యేకంగా పరిచయం చేస్తారనుకొన్నారంతా. కానీ.. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండంతో కుదర్లేదు. నేరుగా ట్రైలర్లోనే కమల్ పాత్రని చూపించేశారు. కమల్ కనిపించింది కొన్ని సెకన్లే. అయితే ఆ ఇంపాక్ట్ మాత్రం వేరేలా ఉంది.
ముఖ్యంగా కమల్ గెటప్, మేకొవర్ మరో స్థాయిలో కనిపించాయి. క్షుణ్ణంగా గమనిస్తే తప్ప ఆయన్ని గుర్తు పట్టలేం. ఆయన మేకప్ కోసం విదేశీ నిపుణుల్ని రంగంలోకి దించార్ట నాగ అశ్విన్. కేవలం మేకప్‌కే 3 గంటల సమయం పట్టేదని తెలుస్తోంది. ఈ సినిమాలో కమల్ ఎంత సేపు ఉంటాడు? ఆయన పాత్ర నిడివి ఎంత అనే విషయాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. సెకండాఫ్‌లో కమల్ పాత్ర ఎంట్రీ ఇస్తుందని, చివరి 20 నిమిషాలూ కమల్ విజృంభణ తెరపై చూడొచ్చని అంటున్నారు. పురాణాల్లోని కంశుడి పాత్రలాంటి క్యారెక్టరైజేషన్ కమల్ లో కనిపిస్తుందని ఇన్ సైడ్ వర్గాలు చెబుతున్నాయి.