ఒలింపిక్స్‌లో కమల్ ప్రీత్ కౌర్ పతకం సాధిస్తుందని ఆశపడిన భారతీయులకు నిరాశే ఎదురయింది. డిస్కస్ త్రో ఫైనల్స్‌కు క్వాలిఫై అయ్యే ప్రయత్నంలో.. రెండో స్థానంలో నిలిచి… పతకం సాధిస్తుందని అనుకున్నా.. చివరికి ఫైనల్లో మాత్రం ఆరో స్థానంతో సరి పెట్టుకుంది. సెమీస్‌లో సాధించిన రికార్డును కూడా ఆమె అధిగమించలేకపోయింది. అమెరికా అధ్లెట్ అగ్రస్థానంలో నిలిచి స్వర్ణం గెలుచుకున్నారు. జర్మనీ, క్యూబా అధ్లెట్లు తర్వాతి స్థానాల్లో నిలిచి రజతం, కాంస్యం అందుకున్నారు.
200 మీటర్ల పరుగులో పోటీ పడిన ద్యూతీ చంద్ హీట్స్‌లో ఏడో స్థానంతోనే సరి పెట్టుకున్నారు. దీంతో అధ్లెటిక్స్‌లో భారత్‌కు పతకం మరోసారి అందని ద్రాక్షగానే మారింది. కమల్ ప్రీత్ కౌర్ అంచనాల్లేకుండా బరిలోకి దిగి.. సెమీస్‌లో రెండో స్థానంలో నిలవడంతో… అంచనాలు పెంచేసుకున్నారు. కానీ ఆమె పతకం స్థాయిలో ఫైనల్ ప్రదర్శన చేయలేకపోవడం అందర్నీ నిరాశ పరిచింది. ఇక ఈ ఒలింపిక్స్ లోనూ అధ్లెటిక్స్‌లో పతకాలఆశలు సన్నగిల్లిపోయనట్లే.
ఇక ఫైనల్ చేరుకునే స్థాయిలో అధ్లెటిక్స్ ప్లేయర్లు భారత జట్టులో ఉన్నారని ఎవరూ అనుకోవడం లేదు. అయితే.. హాకీ జట్లు మాత్రం అద్భుత ప్రదర్శన కబరుస్తున్నాయి. మహిళలు, పురుషుల హాకీ జట్లు సెమీస్‌కు దూసుకెళ్లాయి. నిజానికి పురుషుల హాకీలో భారత్‌కు ఒలింపిక్స్‌లో ఘనమైన రికార్డు ఉంది. కానీ అది చాలా కాలంగా మరుగన పడిపోయింది. ఇప్పుడు పతకం దిశగా.. దగ్గరకు రావడం క్రీడా ప్రేమికుల్నిసంతోషపరుస్తోంది. ఇప్పటికి ఒలింపిక్స్‌లో భారత పతకాల పట్టికలో ఒక రజతం.. మరో కాంస్యం మాత్రమే ఉన్నాయి. మరో వైపు పోటీలన్నీ వరుసగా ముగిసిపోతున్నాయి.