రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములు అమ్మకుండా చేయాలని పెట్టుకున్న టార్గెట్ ను విపక్షాలు దాదాపుగా సాధించాయి. ఈ భూముల విషయంలో అనూహ్యంగా సుప్రీంకోర్టు కూడా స్పందించింది. భూముల్లో పనులు చేపట్టడంపై స్టే ఇస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది. నిపుణుల కమిటీని వేసి.. నివేదిక ఇచ్చేందుకు ఆరు నెలల గడువు ఇవ్వాలని నిరణయించింది. దీంతో కంచ గచ్చిబౌలి భూములు మరోసారి న్యాయవివాదాల్లో చిక్కుకున్నట్లయిందది.
చెట్లు కొట్టివేస్తున్న అంశంపై తాము సుమోటోగా విచారణ చేపట్టమని.హైకోర్టు రిజిస్ట్రార్ నుంచి నివేదిక తెప్పించుకున్నామని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ తెలిపారు. ఆ నివేదిక ద్వారా అటవి భూమిని కొట్టేస్తున్నారని, వన్య ప్రాణాలు ఉన్న ప్రాంతాన్ని ధ్వంసం చేస్తున్నారని..భారీ నిర్మాణాలు ప్రారంభమయ్యాయని తెలిసిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ఈ అంశంపై తెలంగాణ చీఫ్ సెక్రటరీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా బాధ్యత చీఫ్ప సెక్రటరీదేనని స్పష్టం చేసింది. రిట్ పిటిషన్ తయారు చేయాలని అమికస్ క్యూరికీ సుప్రీంకోర్టు సూచించింది. తెలంగాణ సీఎస్ ను ప్రతివాదిగా చేర్చాలని సుప్రీంకోర్టు తెలిపింది.
మరో వైపు హైకోర్టులోనూ విచారణ జరిగింది. అక్కడ కూడా తదుపరి ఉత్తర్వుల వరకూ పనులు నిలిపివేయాలని ఆదేశాలు జచేసింది. ఇప్పుడు ఒకే భూముల కేసులో అటు హైకోర్టు.. ఇటు సుప్రీంకోర్టు స్పందించడంతో.. రేవంత్ ప్రభుత్వానికి ఆ భూముల్ని అమ్మడం అంత తేలికగా సాధ్యమయ్యే పనిగా భావించడం లేదు. 30 ఏళ్ల పాటు నిరుపయోగంగా పడి ఉన్న భూములు మరోసారి కోర్టు పరిధిలోకి వెళ్లాయి. ఎప్పటికి పరిష్కారం లభిస్తుందో అంచనా వేయడం కష్టమే.