ఆ నాలుగు వందల ఎకరాలు.. ఒకప్పుడు ప్లాన్ చేసినట్లుగా కట్టి ఉంటే ఇప్పుడు అతి పెద్ద స్పోర్ట్స్ సిటీల్లో ఒకటిగా ఉండేది. కానీ అది రాజకీయ ప్రతీకారాల కారణంగా కోర్టు కేసుల్లో పడటంతో అలా నిరుపయోగంగా ఉండిపోయింది. చిట్టడవిగా మారిపోయింది. కోర్టు కేసులన్నీ పరిష్కారం కావడంతో ఇప్పుడు ఆ భూమిని అమ్మాలని ప్రభుత్వం అనుకుంది. కానీ నిరుపయోగంగా ఉండటం వల్ల పెరిగిన తుమ్మ చెట్లు.. ఇతర పిచ్చి మొక్కలే ఆటంకంగా మారాయి.
అది అటవీ భూమి కాదు. హెచ్సీయూ భూమి అసలే కాదు. హెచ్సీయూ భూమి అయితే రాష్ట్రానికి అమ్మే అవకాశం ఉండదు. అది అచ్చంగా రాష్ట్ర ప్రభుత్వ భూమి. ఒకప్పుడు స్పోర్ట్స్ సిటీ కట్టాలనుకున్న భూమి. అయితే ఇప్పుడు అక్కడ ఏదైనా నిర్మాణం చేస్తే హైదరాబాద్ పర్యావరణానికే ముప్పు అని ఉద్యమం జరుగుతోంది. న్యాయపోరాటం చేస్తున్నారు. హెచ్సీయూ స్టూడెంట్స్ ను రెచ్చగొట్టి రోడ్లపైకి తెస్తున్నారు.
తెలంగాణలో ఇప్పుడు ఏ సమస్యా లేదు… ఆ నాలుగు వందల ఎకరాలను అమ్మకుండా.. అలాగే చిట్టడవిగా ఉంచితే చాలన్నట్లుగా ఉంది. రాజకీయ పార్టీల ఉద్దేశం రేవంత్ ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థికపరమైన ఆక్సీజన్ అందకూడదన్నది వారి భావన. వారి వ్యూహం ప్రకారం ముందుకు సాగుతున్నారు. నిజానికి ఆ భూముల్ని ఇంతకు ముందే తాకట్టు పెట్టేశారని చెబుతున్నారు. ఇప్పుడు ఆ భూముల్ని వేలం వేస్తారో లేదో కానీ తెలంగాణలో రోజంతా ఈ భూముల ఇష్యూనే నడుస్తోంది.