క్రిష్ దర్శకత్వంలో రీసెంట్ గా వచ్చిన సినిమా కంచె.. అనుకున్నట్టుగానే సినిమా రోజు రోజుకి ఆదరణ పొందుతుంది. తెలుగు సినిమా కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు ఇలాంటి సినిమాలను కూడా తీసి సక్సెస్ సాధిస్తుంది అని మరోసారి ఋజువు చేశాడు క్రిష్. రెండవ ప్రపంచ యుద్ధానికి ఒక ప్రేమకథని కలిపి.. సినిమా కథాంశంలోనే కుల వ్యవస్థ మీద ఏర్పరచుకున్న కంచెను తొలగించమని క్రిష్ చెప్పిన కథాశం అందరికి నచ్చింది. వరుణ్ తేజ్ రెండవ సినిమానే ఇలాంటి ట్రెండ్ సెట్టర్ అటెంప్ట్ చేసి మెగా హీరోల్లో డిఫరెంట్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు.
ఇక సూపర్ సక్సెస్ తో ముందుకు దూసుకెళ్తున్న కంచె సినిమా బాలీవుడ్లో కూడా రీమేక్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఓ పెద్ద నిర్మాణ సంస్థ కంచె సినిమాని బాలీవుడ్లో రీమేక్ చేసేందుకు రెడీ అయ్యిందని క్రిష్ ఎనౌన్స్ చేశాడు. సినిమా సినిమాకు కొత్త రకంగా తనలో ఉన్న క్రియేటివిటీని బయటపెడుతున్న క్రిష్ చూస్తుంటే మరో రాజమౌలి అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు అనిపిస్తుంది. అనుకున్న కథను అనుకున్నట్టుగా తెరకెక్కించి ఎక్కడా కన్ ఫ్యూజన్ లేకుండా పర్ఫెక్ట్ స్క్రీన్ ప్రెజెన్స్ చేయించబట్టే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది.
వరుణ్ తేజ్, ప్రగ్యా జైశ్వాల్ హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఫస్ట్ ఫ్రేం ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయి బాబు నిర్మించారు. మరి బాలీవుడ్ వెళ్తున్న కంచె సినిమా మరెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.