విభిన్నమైన చిత్రాలతో విమర్శకుల మనసుల్న గెలుచుకొంటున్న దర్శకుడు క్రిష్. వేదం, గమ్యం, కృష్ణం వందే జగద్గురుమ్ చిత్రాలతో క్రిష్ ప్రయాణం దిగ్విజయంగా సాగుతోంది. లెటెస్ట్‌గా రూపొందించిన కంచె కూడా విమర్శకుల ప్రసంశలు అందుకొంది. ఇప్పుడు జాతీయ అవార్డుల్లో కంచెకీ ఓ స్థానం దక్కింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కంచె… జాతీయ అవార్డు సాధించింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కించిన సన్నివేశాలు, పాత్రల మధ్య పండించిన భావోద్వేగాలూ.. ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచాయి. కులం అనే మాటను క్రిష్ ఈ చిత్రంలో తనదైన స్థాయిలో నిర్వచించారు. బహుశా ఆ ప్రయత్నమే జ్యూరీ మనసుల్ని గెలుచుకొని ఉంటుంది. గమ్యంతో జాతీయ అవార్డు అందుకొన్న క్రిష్.. ఇప్పుడు మరోసారి కంచెతో తన ప్రతిభని నిరూపించుకొన్నాడు.