కందిరీగతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టాడు సంతోష్ శ్రీన్వాస్. ఆ సినిమా హిట్టయ్యింది. అప్పటి నుంచీ కందిరీగ 2 తీయాలని అనుకుంటూనే ఉన్నాడు. కానీ.. ఆ ప్రయత్నం వాయిదా పడుతూ వచ్చింది. కందిరీగ తరవాత.. ఎన్టీఆర్ తో తెరకెక్కించిన రభస అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో – సంతోష్ శ్రీనివాస్ ని మళ్లీ నమ్మడానికి కాస్త సమయం పట్టింది. రామ్ తో మళ్లీ జట్టు కట్టినా `కందిరీగ 2` తీసే ధైర్యం చేయలేదు. ఆ కాంబినేషన్ లో `హైపర్` వచ్చింది. ఇప్పుడు `అల్లుడు అదుర్స్` సినిమా తెరకెక్కించాడు.. సంతోష్.
ఇప్పుడు మళ్లీ సంతోష్ దృష్టి `కందిరీగ 2`పై పడింది. `అల్లుడు అదుర్స్` తరవాత.. `కందిరీగ 2` స్క్రిప్టు పై మళ్లీ దృష్టి పెట్టే ఆలోచనల్లో ఉన్నాడు సంతోష్. ఎట్టి పరిస్థితుల్లోనూ 2022లోగా.. ఈ కథ పట్టాలెక్కించాలని చూస్తున్నాడట. ఈసినిమాని రామ్ తో చేయాలన్నది తన ఆలోచన. రామ్ కాదన్నా.. మరో హీరోని వెదికి పట్టుకోవాలని చూస్తున్నాడట. రామ్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆచి తూచి అడుగులేస్తున్నాడు. `అల్లుడు అదుర్స్` హిట్టయి.. సంతోష్ శ్రీనివాస్ మళ్లీ తన మార్క్ చూపించగలిగితే.. రామ్ నుంచి పిలుపు రావడం పెద్ద మాటరేం కాదు.