నేను చెప్పేది కవిత్వం కాదంటే రాయిచ్చుకు కొడతానని .. గడుసుగా వాదించేవాడే కవి అవుతాడు.. తాము చెప్పేదే చరిత్ర కాదంటే దేశద్రోహి అనే వాళ్లే బీజేపీ నేత అవుతారు. హీరోయిన్ కంగనా రనౌత్ ఈ విషయాన్ని చాలా వేగంగా తెలుసుకున్నారు. భారత తొలి ప్రధానమంత్రి నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని గట్టిగా వాదిస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దిగారు. మీడియాకు ఇంటర్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ మార్క్ హిస్టరీని తవ్విపోస్తున్నారు.
‘మనకు స్వాతంత్య్రం వచ్చినప్పుడు తొలి ప్రధాని బోస్ ఎక్కడికి వెళ్లారు..?’దేశం కోసం పోరాడిన ఆయన్ను దేశంలోకి అడుగుపెట్టనివ్వలేదని కాంగ్రెస్ను నిందించారు. యాంకర్ ఆమె మాటలను సరిచేశారు. దేశ తొలి ప్రధాని జవహార్లాల్ నెహ్రూ అని గుర్తు చేశారు. అయినా కంగనా తన మాటలే కరెక్ట్ అన్నట్లుగా వాదించడానికి వెనుకాడటం లేదు. గతంలో 2014లో నరేంద్ర మోడీ ప్రధాని అయిన తర్వాతే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందంటూ వ్యాఖ్యలు చేసి, విమర్శల పాలయ్యారు.
కంగనా సెలబ్రిటీ కాబట్టి ఆమె ఇలా చెప్పిందని హైలెట్ చేస్తున్నారు. నిజానికి బీజేపీ నేతంలదరిదీ ఇంతకు మించిన తెలివి తేటలు ఉంటాయి. గాంధీని .. గాడ్సే చంపడం కరెక్టేనని వాదిస్తారు. దేశ విభజనకు గాందీ కారణమంటారు. స్వాతంత్ర ఉద్యమ పోరాటంలో ఆరెస్సెస్ పాత్ర లేకపోయినా.. ఆ సంస్థ గురించి కథలుగా చరిత్రలో ఇరికిస్తారు. ఇలాంటి వారితో పోలిస్తే కంగనా చెప్పింది తక్కువే. కానీ ఆమె తాను పర్ ఫెక్ట్ బీజేపీ అని అలా నిరూపించుకున్నారు.