బాలీవుడ్లో కంగనా రనౌత్ అంటే ఫైర్ బ్రాండ్ అని అందరికీ తెలుసు. మెత్తగా కనిపించే హీరో అయినా.. దర్శకుడు అయినా… వాళ్ల పని అయిపోయినట్లేనంటారు. ఆ విషయం తెలుగు దర్శకుడు క్రిష్‌కు సరిగ్గా తెలియలేదో… తెలిసినా… డైరక్టర్ ఈజ్ కెప్టెన్ ఆఫ్ షిప్ అంటారని.. ధీమాతోనో కానీ ఆమెతో.. మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీని ప్రారభించారు. చాలా రోజులు సినిమాపై వర్క్ చేశారు. కానీ ఆ సినిమా కొలిక్కి రాలేదు. కాని.. క్రిష్ మాత్రం ఎన్టీఆర్ బయోపిక్‌లో బిజీ అయిపోయారు. ఆ తర్వాత ఆనూహ్యమైన వార్తలు బయటకు వస్తున్నాయి. కంగనాకు.. క్రిష్‌కు మధ్య గొడవలు జరిగాయని… విస్తృతంగా ప్రచారం జరిగింది. వాటిని కంగనానే ఖండించింది.
కానీ.. ఆమె వ్యవహరశైలి మాత్రం తేడాగా ఉంది. ఇప్పుడు తనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు క్లెయిమ్ చేసుకుంటోంది. ఈమె తీరు చూసి.. సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్న సోనూ సూద్ కూడా తప్పుకున్నారు. ఓ కీలక పాత్రలో నటిస్తున్న సోనూసూద్ .. పార్ట్ మొత్తం దాదాపుగా పూర్తయింది. ఇంకొన్ని రోజుల్లో చిత్రీకరణ పూర్తవుతుందనగా సోనూ సినిమా నుంచి వైదొలగారు. ఈ విషయాన్ని కూడా కంగనానే వెల్లడించారు. తన లాంటి మహిళా దర్శకురాలితో పని చేయడం ఇష్టం లేకే సోనూ బయటకు వెళ్లిపోయారని ఆరోపిస్తున్నారు.
నిజానికి కంగనా బాధ పడలేక.. క్రిష్.. సినిమాపై దృష్టి తగ్గిచిన తర్వాత కంగనా.. పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుని.. స్క్రిప్ట్ మొత్తాన్ని కంగాళీ చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. కనీసం దర్శకుడు సమాచారం ఇవ్వకుండా.. సన్నివేశాలు చిత్రీకరించుకోవడం ప్రారంభించారట. ఆమె మెంటాలిటి అందరికీ తెలుసు కాబట్టి అందరూ లైట్ తీసుకుంటున్నారు. చివరికి క్రిష్ కూడా.. పూర్తిగా ఎన్టీఆర్ బయోపిక్‌పైనే దృష్టి పెట్టారు. జనవరిలో ఆ సినిమా రిలీజ్ చేయాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ పరిస్థితి చూస్తూంటే.. మణికర్ణిక బయటకు వస్తుందా అని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుటున్నారు.