పాటలు తీయడంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు స్టయిలే సపరేటు! కథానాయిక నాభి అందాలు… పాలు… పువ్వులు… అబ్బో అబ్బోబ్బో… ఆయన తీసిన పాటల్లో శృంగారకళ ప్రేక్షకులను కళ్ళు అప్పగించి చూసేలా చేస్తుంది. ఆయన కుమారుడు, తెలుగులో ‘అనగనగా ఓ ధీరుడు’, ‘సైజ్ జీరో’ సినిమాలు తీసిన దర్శకుడు ప్రకాష్ కోవెలమూడి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునేలా వున్నాడు. దర్శకుడిగా మొదటి సినిమా ‘అనగనగా ఓ ధీరుడు’లోని పాటల్లో శృతి హాసన్‌ని సెక్సీగా చూపించాడు. ‘సైజ్ సెక్సీ’ అంటూ అనుష్కపై ‘సైజ్ జీరో’లో పాట తీశాడు. హిందీలోకి దర్శకుడిగా అడుగుపెడుతున్న ‘మెంటల్ హై క్యా’తో మరో ఐదారు మెట్లు ఎక్కినట్టు వున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ చూశారా? స్విమ్ సూట్లో కంగనా రనౌత్‌ను ఎంత సెక్సీగా చూపించారో! ఆడియన్స్ ఈ పోస్టర్ గురించి బాగా డిస్కస్ చేసుకుంటున్నారు. పోస్టర్ సంగతి పక్కన పెడితే.. ఇది థ్రిల్లర్ సినిమా అట. ప్రకాష్ వైఫ్ కణికా థిల్లాన్ ఈ సినిమాకు కథ రాశారు. ‘క్వీన్’లో కంగనా రనౌత్ జోడీగా నటించిన రాజ్ కుమార్ రావు ఇందులో హీరో.