బాలీవుడ్ లో వివాదాలకు కేరాఫ్ అడ్రస్స్ అంటే కంగనా రనౌత్ పేరే చెప్పాలి. ఒకటా, రెండా? కంగనా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు అన్నీ ఇన్నీ కావు. తనే టాక్ ఆఫ్ ది బాలీవుడ్. ఎప్పుడూ.. కొండంత ఆవేశాన్ని మోసుకుని వస్తుంటుంది. రఫ్ అండ్ టఫ్ గా కనిపిస్తుంది. ఐరన్ లేడీ లాంటి ఇమేజ్ సొంతం చేసుకుంది. అయితే ఇప్పుడు కంగనా పెళ్లి, పిల్లల గురించి కలలు కంటూ.. తనలోని కొత్త యాంగిల్ ని చూపిస్తోంది. ఎప్పుడూ వైవాహిక జీవితం గురించి పల్లెత్తు మాట మాట్లాడని కంగనా… ఇప్పుడు పెళ్లి, పిల్లలు అంటూ కొత్త పాట పాడుతోంది.
”నాక్కూడా పెళ్లి చేసుకోవాలని, పిల్లల్ని కనాలని ఉంది. వచ్చే ఐదేళ్లలో ఓ భార్యగా, ఓ తల్లిగా కొత్త కంగనాని చూడబోతున్నారు. నా జీవితంలోకి తప్పకుండా ఓ కొత్త వ్యక్తి వస్తాడు. తనతో నా కలలు సాకారం కాబోతున్నాయి. అతనెవరన్నది కాలమే నిర్ణయిస్తుంది” అంటోంది కంగనా. అంటే… త్వరలోనే కంగనా పెళ్లి చేసుకోబోతోందన్నమాట. కాకపోతే.. కంగనాకి కాబోయే వరుడు ఎవరన్నది ప్రస్తుతం వేధిస్తున్న ప్రశ్న. బాలీవుడ్ లో ప్రేమ పెళ్లిళ్లు అత్యంత సాధారణమైన విషయం. కంగనాకు కూడా లివిన్ రిలేషన్స్‌పై మంచి అభిప్రాయమే ఉంది. కాబట్టి.. కంగనాది ప్రేమ వివాహమే కానుందని బాలీవుడ్ లో ఓ టాక్ వినిపిస్తోంది. ఆ బాంబు కూడా త్వరలోనే పేలుస్తుందేమో?!