కంగనారనౌత్.. వివాదాలకు పెట్టింది పేరు. బాలీవుడ్ ఎప్పుడూ తాను హాట్ టాపిక్కే. తెలుగులో ఓ సినిమా చేసింది. అదే ఏక్ నిరంజన్. ఆ సినిమా ఫ్లాపవ్వడం, తన పాత్రకు సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో అప్పట్లో అమ్మడు బాగా హర్టయ్యింది. తెలుగు వాళ్లకు సరైన టేస్ట్ లేదన్నట్టు, హీరోలదే రాజ్యం అన్నట్టు మాట్లాడింది. అయితే ఇప్పుడు నిర్ణయం మార్చుకున్నట్టుంది. `తెలుగులో నటించడానికి ఎప్పుడూ రెడీనే. పూరి పిలిస్తే… ప్రభాస్ సినిమాలో అవకాశం వస్తే.. తప్పకుండా నటిస్తా` అంటోంది.
తను నటించిన తలైవి ఈవారంలోనే విడుదల అవుతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడింది కంగనా. “ఇప్పుడు కూడా పూరి సర్ తో టచ్లో ఉంటాను. మీ సినిమాలో అవకాశం ఇవ్వండి అని. ప్రభాస్ పక్కన ఛాన్స్ ఇవ్వండి.. అని చాలాసార్లు ఆయన్ని అడిగాను. ఆయన పిలిస్తే మళ్లీ మళ్లీ తెలుగులో నటిస్తా“ అని చెప్పుకొచ్చింది. పూరి – ప్రభాస్ కాంబోలో రెండు సినిమాలొచ్చాయి. వీరిద్దరూ కలిసి సినిమా ఎప్పుడు చేస్తారో.. కంగనాకు అవకాశం ఎప్పుడు ఇస్తారో?!