తమిళం తో పాటు తెలుగులోనూ మంచి పాపులరిటీ వున్న హీరో సూర్య. తెలుగులో తనకి మంచి ఫ్యాన్ బేస్ వుంది. ఆయన కొత్త సినిమా ‘రెట్రో’ మే 1న థియేటర్లలో రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమాకు తెలుగులో చెప్పుకోదగ్గ క్రేజ్ కనిపించడం లేదు. సూర్య గత సినిమా కంగువా భారీ పరాజయం చవి చూసింది. పాన్ ఇండియా సంచలనంగా మారుతుందని ఆశలు పెట్టుకున్నా సినిమా దెబ్బకొట్టింది. ఆ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు రెట్రో పై పడింది. కంగువా తెలుగు హక్కులు రూ. 22 కోట్లకుపైగా వెళ్ళాయి. రెట్రో బిజినెస్ సగానికి సగం తగ్గిపోయింది. రిట్రో తెలుగు హక్కులు కేవలం రూ.10 కోట్లకే అమ్ముడయ్యాయి.
డైరెక్టర్ కార్తిక్ సుబ్బరాజ్‌కు కూడా తెలుగులో సరైన హిట్ లేదు. బజ్ లేకపోవడానికి ఇది కూడా ఓ కారణమైయింది. హీరోయిన్ పూజా హెగ్డే క్రేజ్ కూడా రెట్రో కి కలసి రావడం లేదు. అటు ట్రైలర్ కూడా హైప్‌ను సృష్టించలేకపోయింది. ట్రైలర్ కొత్తగా కట్ చేశారు కానీ, కథేమిటో కాన్సెప్ట్ ఏమిటో ఎవరికీ అర్థం కాకుండా పోయింది. ఆ సినిమా గురించి మాట్లాడుకోవడానికి కూడా మేటర్ ఇవ్వలేకపోయింది ట్రైలర్. పాటలు జనంలోకి వెళ్లినా కాస్తో కూస్తో బజ్ వచ్చేది. అన్నింటికంటే ముఖ్యంగా నాని HIT 3 రూపంలో సూర్య సినిమాకి పోటీ కూడా వుంది. కంగువా రిజల్ట్ యావరేజ్ గా వున్నా ఇప్పుడు రెట్రో పరిస్థితి ఇంత వీక్ గా వుండేది కాదు. ఒక డిజాస్టర్ సినిమా పర్యవసనాలు ఎలా ఉంటాయో సూర్య ఇప్పుడు కంగువా పుణ్యమా అని ప్రత్యేక్షంగా తెలుసుకొంటున్నాడు.