వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాపు రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తెచ్చారని.. ఆర్థిక, సామాజిక పరిస్థితులపై అధ్యయనం చేశారన్నారు. చంద్రబాబు ఈ రిజర్వేషన్లను పూర్తి చేశారన్నారు. చంద్రబాబు ఇచ్చిన రిజర్వేషన్లను ప్రభుత్వం తొలగించిందని.. కన్నా చెప్పకనే చెప్పారు. ఈడబ్ల్యూఎస్ కోటా కిందకాపులకు రిజర్వేషన్లు పునరుద్ధరించాలని ఆయన డి్మాండ్ చేస్తున్నారు. ఇటీవల జీవీఎల్ నరసింహారావు కాపులతో సన్మానాలు చేయించుకుంటున్నారు. ఇలా ఎందుకు చేయించుకుంటున్నారని.. ఆయన కాపులకుఏం చేశారని కన్నా ప్రశ్నిస్తున్నారు.
కేంద్రం తెచ్చిన పది శాతం ఈడబ్ల్యూఎస్ కోటా రిజర్వేషన్లలో ఐదు శాతం కాపులకు కేటాయిస్తూ చంద్రబాబు ప్రభుత్వం చట్టం చేసింది. ఇక సర్టిఫికెట్లు జారీ చేయడమే మిగిలి ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ రిజర్వేషన్లు చెల్లవని క్యాన్సిల్ చేసింది. దీంతో కాపులకు రిజర్వేషన్లు దక్కకుండా పోయాయి. ఈ అంశంపై పార్లమెంట్లో జీవీఎల్ ఓ ప్రశ్న అడిగారు. ఆ ప్రశ్నకు సమాధానంగా.. చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన కాపు రిజర్వేషన్లు చెల్లుతాయని చెప్పింది. అలా తాను ప్రశ్న అడిగినందుకే ఆ సమాధానం వచ్చిందని జీవీఎల్ నరసింహారావు సన్మానాలు చేయించుకున్నారు. ఇది కన్నాకు కోపం తెప్పించిది .
జనసేన విషయంలో బీజేపీ నేతలు చేస్తున్న ప్రకటనలపైనా కన్నా అభ్యంతరం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధినేత పవన్ .. తన నిర్ణయాలను తాను తీసుకోనివ్వాలని ఇతరులు ప్రభావితం చేసే ప్రయత్నం చేయవద్దని సూచించారు. ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారని స్పష్టం చేశారు. ఒకప్పుడు చంద్రబాబును కన్నాతీవ్రంగా ద్వేషించేవారు. వ్యక్తిగత విమర్శలు చేసేవారు. అయితే ఇప్పుడు మాత్రం గుర్తు చేసి మరీ కాపులకు మంచి చే్శారని చెబుతున్నారు.