రూ. ఇరవై కోట్లకు టీడీపీకి అమ్ముడుపోయారంటూ… విజయసాయిరెడ్డి చేసిన ఆరోపణలను తేలికగా తీసుకోకూడదని.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ డిసైడయ్యారు. ఆయనపై క్రిమినల్ కేసు పెట్టబోతున్నానని ప్రకటించారు. కరోనా టెస్టింగ్ కిట్ల విషయంలో… భారీ అవినీతికి పాల్పడ్డారని.. కన్నా లక్ష్మినారాయణ ట్విట్టర్ ద్వారా ఆరోపించారు. దీనిపైనే.. విజయసాయిరెడ్డి… కన్నా లక్ష్మినారాయణ టీడీపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. అసలు తాను చేసిన ఆరోపణలకు… వాస్తవాలు బయట పెట్టాలని డిమాండ్ చేస్తే.. ఎదురు ఆరోపణలు చేయడం ఏమిటని కన్నా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ బీజేపీ ఆదివారమే కన్నాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. ట్విట్టర్ ద్వారా ఘాటు విమర్శలు చేసింది. ఈ రోజు ఉదయం కన్నా లక్ష్మినారాయణనే స్వయంగా ప్రెస్‌మీట్ పెట్టారు. తనను కొనేవాళ్లు పుట్టలేదని… విజయసాయిరెడ్డికి తేల్చి చెప్పారు. ఈ సందర్భంగా.. కిట్ల వ్యవహారంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరును వివరించారు. పర్చేజ్ ఆర్డర్ ప్రకారం ఒక్కో కిట్ ధర 730 రూపాయలు ప్లస్ జీఎస్టీ అని ఇచ్చారు. ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి 640 రూపాయలు అని చెబుతారు. సాక్షి పత్రికలో మాత్రం ఏప్రిల్ 9న కిట్ ధర 12 వందల రూపాయలకు మెడ్‌టెక్ జోన్లో తయారు చేస్తున్నట్లు వార్త రాశారు. మన దగ్గర నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు రాశారు. అయితే చివరికి చేసినపనిని బయటపెడితే.. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకుంటున్నారని మండిపడ్డారు.
అవినీతి చేసి జైలుకు వెళ్లిన వచ్చిన వ్యక్తితనపై విమర్సలు చేయడం ఏమిటని ప్రశఅనించారు. విజయసాయికి వచ్చే కమిషన్ పోయిందని బాధపడుతున్నారా అని ప్రశ్నించారు. అధికార మదంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడొద్దని హెచ్చరించారు. చత్తీస్‌గఢ్ ప్రభుత్వం టెండర్లు పిలిచి కాంట్రాక్టులు ఇస్తే.. ఏపీ సర్కార్ నామినేషన్ పద్దతిన కాంట్రాక్ట్ ఇవ్వడం ఏమిటని.. కన్నా ప్రశ్నించారు. ప్రజా ధనాన్ని దోపిడీ చేస్తూంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. విజయసాయిరెడ్డి ఈ ఉదయం కూడా తన ట్విట్టర్లో… కన్నా టీడీపీకి అమ్ముడుపోయారని ఆరోపించారు. దీంతో.. బీజే్పీతో ఆయన ఎగ్రెసివ్గానే వెళ్లాలని అనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. బీజేపీ కూడా.. అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చేందుకు సిద్ధమవుతోందని.. కన్నా రియాక్షన్ బట్టి తెలుస్తోందని భావిస్తున్నారు.