మాజీ మంత్రి , బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ… బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. బీజేపీ అధ్యక్ష పదవికి చివరి వరకు తీవ్రంగా పోటీ పడిన కన్నా,.. ఇక ఆ పదవి తనకు రాదని తెలియడంతో… రాజకీయ భవిష్యత్ కోసం… పార్టీ మారాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు వైసీపీ నేతలతో చర్చలు జరిపారు. నిజానికి కన్నాతో.. గత ఏడాదిగా వైసీపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే కన్నా మాత్రం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ లాంటి పార్టీకి రాష్ట్ర అధ్యక్ష పదవి అంటే.. ఎంతో పలుకుబడి ఉంటుందని … ఆ పదవి కోసం తీవ్రంగా ప్రయత్నించారు. కానీ వలస నేతలకు పదవి ఇవ్వదల్చుకోలేదని… బీజేపీ హైకమాండ్ స్పష్టమైన సూచనలివ్వడంతో… జంపింగ్ కు నిర్ణయం తీసుకున్నారు.
కన్నా లక్ష్మినారాయణ పార్టీలో చేరడానికి సిద్ధంగానే ఉన్నా.. సీటు ఖరారు కోసం ఇంత కాలం చర్చలు జరిపారు. గుంటూరు వెస్ట్ లో కాపుల జనాభా గణనీయంగా ఉంటుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసినప్పటికీ.. కన్నా.. ఇరవై వేల ఓట్లను తెచ్చుకోగలిగారు. అందుకే మొదటి ప్రయారిటీగా.. గుంటూరు వెస్ట్ సీటునే అడిగారు. కానీ జగన్ మాత్రం.. పెదకూరపాడుకు వెళ్లాల్సిందిగా సూచించినట్లు సమాచారం. పెదకూరపాడు నుంచి కన్నా వరుసగా ఐదు సార్లు గెలుపొందారు. తర్వాత గుంటూరుకు మారారు. గుంటూరులో వైసీపీకి ప్రస్తుతం ఇన్చార్జ్ గా అప్పిరెడ్డి ఉన్నారు. గత ఎన్నికల్లో ఘోరపరాజయం పాలయ్యారు. దాంతో జగన్ ఈ సారి.. విజ్ఞాన్ సంస్థల అధినేతకు కానీ..ఆయన వారసుడికి కానీ టిక్కెట్ ఇవ్వాలని భావిస్తున్నారన్నప్రచారం జరుగుతోంది.
ఇప్పటికి పెదకూరపాడుకు ఒప్పుకుని పార్టీలో చేరుతున్న కన్నా.. పరిస్థితులను బట్టి..మళ్లీ గుంటూరు వెస్ట్ సీటుకే పట్టుబట్టే అవకాశం ఉంది.ఎందుకంటే… పెదకూరపాడు నియోజకవర్గంలో కొంత భాగం ఇప్పుడు రాజధాని పరధిలో ఉంది. అమరావతి పెదకూరపాడులో భాగమే. పైగా అక్కడి ఎమ్మెల్యే… కొమ్మాలపాటి శ్రీధర్… ప్రజలకు అందుబాటులో ఉంటాడనే పేరు ఉంది. ఎలా చూసుకున్నా..తనకు గుంటూరు వెస్ట్ కరెక్టని కన్నా కూడా భావిస్తున్నారు. వచ్చే ఎన్నికలకు.. గుంటూరు వెస్ట్ కు. వైసీపీ అభ్యర్థి కన్నా అవడానికే ఎక్కువ అవకాశం ఉంది.